ప్రణబ్ ఆరోగ్యం విషమం

by Anukaran |
ప్రణబ్ ఆరోగ్యం విషమం
X

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి, భారత రత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం విషమించింది. ఆదివారం నుంచి ఆయన ఆరగ్యం క్షీణిస్తున్నది. లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన సెప్టిక్ షాక్‌లో ఉన్నట్టు ఢిల్లీలోని ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ వెల్లడించింది. గతనెలలో ఆయనకు బ్రెయిన్ సర్జరీ అయినప్పటి నుంచి వెంటిలేటర్ సపోర్ట్‌తోనే చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

బ్రెయిన్‌లో కణతిని తొలగించడానికి ఆగస్టు 10న ప్రణబ్ ముఖర్జీ ఆస్పత్రిలో చేరారు. అదేరోజు అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. అప్పటి నుంచి డీప్ కోమాలోనే ఉన్నారు. ఆస్పత్రిలో చేరగానే ఆయనకు కరోనా పాజిటివ్ తేలింది. ఇటీవలే లంగ్ ఇన్ఫెక్షన్‌తోపాటు కిడ్నీసంబంధిత సమస్యలు కనిపించాయి. మూత్రపిండాలకు సంబంధించిన ప్యారామీటర్లు సరిగా లేవని బుధవారం ఆస్పత్రి వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా, లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన సెప్టిక్ షాక్ ఎదుర్కొంటున్నట్టు హాస్పిటల్ వెల్లడించింది. సెప్టిక్ షాక్‌తో ఇతర అవయవాలు విఫలమయ్యే ప్రమాదమున్నదని కొందరు నిపుణులు చెప్పారు.

Advertisement

Next Story