- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్లీజ్.. మంచి సినిమా నా వల్ల కాంట్రవర్సీ కావద్దు : ప్రకాష్ రాజ్
దిశ, సినిమా: కులం, డబ్బు, అధికారం, హోదా వంటివి న్యాయ వ్యవస్థను ఏ విధంగా ఏమారుస్తాయో కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా ‘జై భీమ్’. 1995లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా సూర్య లీడ్ రోల్‌లో తెరకెక్కిన ‘జై భీమ్’ చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులోని ప్రతీ పాత్ర గుండెకు హత్తుకునేలా ఉంది. ఈ విషయం పక్కన బెడితే.. ప్రకాష్ రాజ్‌పై చిత్రీకరించిన ఓ సన్నివేశంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో ఐజీ(పెరుమాళ్ల స్వామి) పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్.. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఒక వ్యక్తిని విచారిస్తుండగా, అతడు హిందీలో మాట్లాడతాడు. అయితే కేసును పక్కదారి పట్టించేందుకే అలా చేస్తున్నాడని భావించిన ప్రకాష్ రాజ్ అతని చెంపపై కొట్టి తమిళంలో మాట్లాడమంటాడు. ఇప్పుడు ఇదే సీన్‌పై కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ వీడియో క్లిప్‌ను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసన తెలియజేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై ప్రకాష్ రాజ్ స్పందించాడు. ‘జై భీమ్ సినిమాలో అణగారిన వర్గాల బాధను, కష్టాన్ని చూపించాం. కానీ కొంతమంది అసలు విషయాన్ని మరిచి, చెంపదెబ్బ సన్నివేశంపైనే దృష్టి పెట్టారంటే వాళ్ల ఎజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చు’ అని ట్వీట్ చేశాడు. ‘కేసు నుంచి తప్పించుకునే మార్గం కోసం స్థానిక భాష తెలిసినా హిందీలో మాట్లాడుతుంటే ఏ పోలీసు అధికారైనా అలానే రియాక్ట్ అవుతారు. కేవలం నేను నటించాననే కారణంతో సినిమాను వివాదంలోకి లాగుతున్నారు. ఇలాంటి వివాదాలపై స్పందించడంలో అర్థం లేదు’ అని ఆయన తెలిపారు.