- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యంగ్ డ్రీమ్స్ ఓడిపోకూడదు : ప్రకాశ్ రాజ్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం ఇండస్ట్రీలో ‘నెపోటిజం’ను ఎత్తిచూపేలా చేస్తోంది. సుశాంత్ ఆత్మహత్యకు కారణం ‘ఒత్తిడే’ అని ప్రాథమిక నిర్ధారణ కాగా.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సుశాంత్ నెపోటిజం గురించి మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. బంధుప్రీతి అనేది నటీనటుల ప్రతిభకు అడ్డుపడుతోందని.. కొత్తగా వచ్చిన నటులను ప్రోత్సహించకపోతే ఇండస్ట్రీ మూతపడుతుందని హెచ్చరించాడు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రకాశ్ రాజ్.. అవును బంధుప్రీతి ప్రతీ చోటా ఉందని చెప్పాడు. నేను వాటిని ఎదుర్కొంటూనే ఇక్కడికి వచ్చాను. నాక్కూడా చాలా దెబ్బలు తగిలాయి.. వాటిని అధిగమిస్తూ వచ్చా. కానీ ఈ చిన్న పిల్లాడైన సుశాంత్ వాటిని తట్టుకోలేకపోయాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇప్పటికైనా మనం నేర్చుకుందాం.. ఇలాంటి యంగ్ డ్రీమ్స్‌ను కాపాడుకుందాం’ అని పిలుపునిచ్చాడు.
https://twitter.com/prakashraaj/status/1272597715621302273?s=20