అనుష్కకు 3am ఫ్రెండ్ ఉన్నాడటా?

by Shyam |
అనుష్కకు 3am ఫ్రెండ్ ఉన్నాడటా?
X

అనుష్క‌కు తెల్లవారు జామున 3గంటల వరకు మాట్లాడేంత మంచి ఫ్రెండ్ ఉన్నాడట. ఈ విషయాన్ని ఆదివారం స్వీటీ స్వయంగా వెల్లడించింది. ఆయన మరెవరో కాదు మన డార్లింగ్ ప్రభాస్. అనుష్క ప్రభాస్ కలిసి నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ బహుబలిలో వీరి కెమిస్ట్రీ అంతలా కుదిరింది మరి. ఈ సినిమా రాకముందు నుంచే వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అంటా. ప్రభాస్‌కు ఏ సమయంలో కాల్ చేసినా మాట్లాడతాడని, అంత చనువు తామిద్దరి మధ్య ఉందని తెలిపింది మన దేవసేన. అయితే తమ ఇద్దరికి ఇంకా పెళ్లి కాకపోవడంతో చాలా వదంతులు వస్తున్నాయని పేర్కొంది. అయినా అలాంటిది ఏదైనా ఉంటే ఓపెన్‌గా చెప్పేస్తామని, ప్రభాస్ కు తనకు ఎలాంటి భావోద్వేగాలు ఆపుకోవడం ఇష్టం లేదని తెలిపారు. ప్రభాస్, తన వ్యక్తిత్వం ఒకేలా ఉండటం వల్లే మేం మంచి ఫ్రెండ్స్‌గా కలసి ఉన్నామని చెప్పుకొచ్చింది స్వీటీ.
tags ; anushka , 3 am friend, prabhas, not married, no hidden of feelings

Advertisement

Next Story

Most Viewed