- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూమిని తాకనున్న సౌర తుఫాన్.. సెల్ సిగ్నల్స్‌పై ఎఫెక్ట్!
దిశ, ఫీచర్స్: సూర్య వాతావరణం నుంచి ఉద్భవించిన పవర్‌ఫుల్ సోలార్ స్టార్మ్(సౌర తుఫాన్) ఒకటి భూమిని సమీపించింది. 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఈ తుఫాన్ ఆదివారం లేదా సోమవారం భూమిని తాకనుందని Spaceweather.com వెల్లడించింది. భూమి అయస్కాంత క్షేత్ర ఆధిపత్యంలో ఉన్న స్పేస్ రీజియన్‌పై ఇది గణనీయ ప్రభావం చూపనుందని తెలుస్తోంది.
భూమిపై ఎఫెక్ట్..
సౌర తుఫాన్ కారణంగా నార్త్ లేదా సౌత్ పోల్‌లో నివసిస్తున్నవారికి ప్రకాశవంతమైన ఖగోళ కాంతి(సెలెస్టియల్ లైటింగ్) కనిపించనుంది. ఇదిగంటకు 1.6 మిలియన్ కిలోమీటర్ల వేగంతో భూమి వైపునకు దూసుకొస్తుండగా, ఇంకా ఆ వేగం పెరిగే అవకాశం ఉందని యూఎస్ స్పేస్ ఏజెన్సీ నాసా తెలిపింది. అంతేకాదు ఈ సోలార్ స్టార్మ్ వల్ల శాటిలైట్ సిగ్నల్స్‌కు అంతరాయం కలుగుతుందని చెప్పింది. సౌర తుఫాన్ల వల్ల భూమి బయటి వాతావరణం వేడెక్కనుండగా.. శాటిలైట్లపై నేరుగా ప్రభావం చూపనుంది. జీపీఎస్ నావిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్, శాటిలైట్ టీవీ సేవల అంతరాయానికి కారణమవుతుంది. అంతేకాదు పవర్ లైన్స్‌లో విద్యుత్ ప్రవాహం పెరిగి ట్రాన్స్‌ఫార్మర్స్ కూడా పేలిపోవచ్చు.