కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్న పవన్ కళ్యాణ్

by srinivas |
కరోనా నుంచి సంపూర్ణంగా కోలుకున్న పవన్ కళ్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షులు హరిప్రసాద్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన వైద్యుల పర్యవేక్షణలో హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకున్నారు. గత మూడు రోజుల కిందట ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా, అందులో నెగెటివ్ వచ్చింది. కరోనా అనంతరం వచ్చే నిస్ట్రాణం వంటి మాత్రం ఉన్నాయని.. ఆరోగ్యపరంగా పవన్ కళ్యాణ్‌కు ఎలాంటి ఇబ్బందులు లేవని, వైద్యులు తెలియజేసినట్టు పేర్కొన్నారు. అంతేగాకుండా.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యక్షేమాల కోసం ఆకాంక్షించిన వారికి, పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, నాయకులు అభిమానులకు పవన్ కళ్యాణ్ కృతజ్ఙతలు తెలియజేశారు. ప్రస్తుతం కొవిడ్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉన్నందున ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలని, వైద్యులు అందిస్తున్న సూచనలు అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed