- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టులు తగ్గాయ్.. పాజిటివ్ కేసులు పెరిగాయ్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో కరోనా టెస్టుల సంఖ్య పెరగకపోయినా పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. గత వారం రోజులుగా టెస్టుల సంఖ్య లక్షకంటే కొంచెమే ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ పాజిటివ్ కేసులు మాత్రం దాదాపు రెట్టింపు స్థాయికి చేరుకుంటున్నాయి. రాష్ట్రంలో దాదాపు మూడింట ఒక వంతు కేసులు హైదరాబాద్ నగరం నుంచే నమోదవుతున్నాయి. వారం రోజుల క్రితం (ఈ నెల 18న) 83 వేల టెస్టులు చేస్తే నాలుగు వేల కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాతి రోజు నుంచి లక్షకు పైగా టెస్టులు కొంచెం అటూ ఇటుగా కొనసాగినా పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. ఎక్కువ మంది పాజిటివ్ బారిన పడుతున్నారు.
గడచిన 24 గంటల్లో రాష్ట్రం మొత్తం మీద సుమారు ఏడున్నర వేల పాజిటివ్ కేసులు నమోదైతే అందులో ఒక్క హైదరాబాద్ నగరంలోనే రెండున్నర వేలు ఉన్నాయి. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలను పరిగణనలోకి తీసుకుంటే దాదాపు ఒకటిన్నర వేయి కేసులు ఉన్నాయి. కేవలం ఏడు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మూడంకెల స్థాయిలోనే కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో అది నాలుగంకెలకు చేరుకుంది. డబుల్ డిజిట్‌లో ఉన్న జిల్లాల్లో సైతం వందకు చేరువవుతున్నాయి. ఏడు జిల్లాల్లో వారం క్రితం రెండంకెల స్థాయిలో కొత్త కేసులు నమోదైతే ఇప్పుడు అక్కడ ట్రిపుల్ డిజిట్ క్రాస్ చేశాయి.
నైట్ కర్ఫ్యూ పెట్టిన తర్వాత కూడా అనేక జిల్లాలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ అర్బన్ జిల్లాలను పరిశీలిస్తే, 24 గంటల క్రితం కేవలం 89 కేసులు మాత్రమే వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదైతే శనివారం ఉదయానికి ఒక్కసారిగా 323కు పెరిగాయి. ఖమ్మం జిల్లాలో సైతం 24 గంటల క్రితం 152 కొత్త కేసులు నమోదైతే ఇప్పుడు 325కు పెరిగాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో కట్టడి చర్యలు ఎలా ఉన్నా కేసులు మాత్రం భారీ స్థాయిలో పెరుగుతున్నాయి.