- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నేతలు ముఖం అద్దంలో చూసుకోవాలి: పోసాని
దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ నేతలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులపై మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు తమ ముఖాలు అద్దంలో చూసుకోవాలని విమర్శించారు. ప్రాజెక్టు నిర్మాణాలు కమీషన్ల కోసమేనని ప్రతిపక్షాలు విమర్శలు చేయడం సబబు కాదన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ను ప్రజల కోసమే నిర్మిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా ప్రజల కోసమే నిర్మిస్తున్నారని ఎందుకు అనుకోవడం లేదన్నారు. కాళేశ్వరం పూర్తయితే తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌ను ఓడించాలని రాజకీయాలు చేస్తే ఎప్పటికీ ప్రతిపక్షంలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎక్కడున్నది ముఖ్యం కాదని, ప్రజలకు సేవ చేస్తున్నాడా లేదా అనేది ముఖ్యమన్నారు. పోతిరెడ్డిపాడుపై ఇరురాష్ట్రాల సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటారని, వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉందన్నారు. కేసీఆర్ చెబితే జగన్ వింటారని, జగన్ రిక్వెస్ట్ చేస్తే కేసీఆర్ ఆలోచిస్తాడని తెలిపారు. ఏపీలో ప్రతిపక్షం అసత్యాలు ప్రచారం చేస్తూ రైతులను గందరగోళానికి గురి చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ అవినీతిపరుడని ప్రతిపక్షాలు నిరూపిస్తే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేస్తానని సవాల్ విసిరారు. రూ.50 లక్షలు లంచం ఇస్తూ పట్టుబడ్డ వ్యక్తి రేవంత్‌రెడ్డి అని, కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. రెండు, మూడు రోజులుగా కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి విమర్శలు చేస్తున్నారని… కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణకు రెండు కళ్లు అని కొనియాడారు.