విద్యార్థుల కోసం యుక్తి పోర్టల్

by Shamantha N |
విద్యార్థుల కోసం యుక్తి పోర్టల్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా లాక్‌డౌన్ కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఓ వెబ్ పోర్టల్‌ని ప్రారంభించింది. యుక్తి (నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్) పేరుతో పిలుస్తున్న ఈ పోర్టల్‌ను కేంద్ర హెచ్ఆర్డీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆవిష్కరించారు. విద్యార్థుల ప్రమోషన్ పాలసీలు, ప్లేస్‌మెంట్లకు సంబంధించి, మానసిక భౌతిక సమస్యలకు సంబంధించిన అంశాల గురించి ఈ పోర్టల్ తెలియజేయడమే కాకుండా పరిష్కారాలు కూడా అందిస్తుంది.

విద్యా రంగాన్ని మానసికంగా, శారీరకంగా బలంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈ పోర్టల్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. ఇంకా ఈ పోర్టల్‌లో ప్రత్యేకంగా కొవిడ్‌కి సంబంధించిన అంశాల మీద పరిశోధనకు, అధ్యయనానికి, సామాజిక అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కేవలం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మాత్రమే కాకుండా ఇతర అధ్యయన సంస్థలు కూడా కొవిడ్ సమాచారాన్ని పంచుకునే సదుపాయం కల్పించారు. రానున్న ఆరు నెలల్లో ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యల గురించి ఈ పోర్టల్ ద్వారా ఒక అవగాహన వచ్చే అవకాశం ఉందని రమేష్ పోఖ్రియాల్ ఆశ వ్యక్తం చేశారు.

Tags:Corona, HRD ministry, Students, Portal, Government

Advertisement

Next Story

Most Viewed