బల్దియాకు రూ.10 లక్షల సామగ్రి అందజేత

by Shyam |   ( Updated:2020-04-16 05:36:03.0  )
బల్దియాకు రూ.10 లక్షల సామగ్రి అందజేత
X

దిశ, హైదరాబాద్ : జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిబ్బందికి రూ. 10 లక్షల విలువైన 50 పోర్టబుల్ స్ప్రేయర్స్, 1000 లీటర్ల శానిటైజర్లను పసుర గ్రూప్ వితరణ చేసింది. ఈ సామగ్రిని ఈవీడీఎం డైరెక్టర్ విశ్వజిత్ కాంపాటికి గురువారం ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అన్ని కాలనీలు, బస్తీలు, ఇరుకైన ప్రాంతాలకు సైతం వెళ్లి స్ప్రే చేసేందుకు పసుర గ్రూప్ ఆధ్వర్యంలో అందజేసిన పోర్టబుల్ స్ప్రేయర్స్ ఉపయోగపడతాయని అన్నారు. కరోనా మహమ్మారి నియంత్రణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నదని తెలిపారు. లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో తెల్ల రేషన్ కార్డుదారులకు ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, ఒక్కో కార్డుకు 1500 రూపాయల నగదు, ఉపాధి కోసం నగరానికి వచ్చిన వలస కూలీలు, కార్మికులకు ఒకొక్కరికి 12 కిలోల బియ్యం, 500 రూపాయల నగదును అందజేస్తున్నట్లు తెలిపారు.

నగరంలోని అన్ని కాలనీలు, బస్తీల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయించడంతో పాటు ప్రజలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.. ప్రతినిత్యం పేదలకు ఆహారం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారని మంత్రి వివరించారు.
కార్యక్రమంలో పసుర గ్రూప్ చైర్మన్ మోహన్ కుమార్, ఎండీ ప్రశాంత్, ఈడీ రవీందర్, సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జి సాయి కిరణ్ యాదవ్, రజనీకాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Tags : corona effect,pasura group, donation, ghmc evdm, minister talasani

Advertisement

Next Story

Most Viewed