- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహే : పొన్నాల
దిశ,తెలంగాణ బ్యూరో : హుజూర్‌నగర్ ఎన్నికల సమయంలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీలు సీఎం కేసీఆర్ గాలికొదిలేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పొన్నల లక్ష్మయ్య అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉప ఎన్నికల ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఎన్నికలుంటేనే సమీక్షలు గుర్తొస్తాయని ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా ఇచ్చిన హామీలపై సమీక్షించే సమయం లేదు కానీ, ఉప ఎన్నిక కోసం సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు.
నాగార్జునసాగర్ ఎడమ కాలువ నీటిని జూలై 15న విడుదల చేయాల్సి ఉండగా ఆదివారం విడుదల చేశారని, రైతులకు ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దళితబంధును కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని, కాని రాష్ట్రమంతా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీని వదిలేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని సీఎం కేసీఆర్ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహి అని పేర్కొన్నారు.