మూడు రాష్ట్రాల్లో నేటితో ప్రచారానికి తెర!

by Shamantha N |
election campaign
X

న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాలు, అసోం, తమిళనాడు, కేరళతోపాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికల ప్రచార గడువు ఈ రోజుతో ముగియనుంది. రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకోవడానికి ఈ ఒక్క రోజే మిగిలి ఉంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో సింగిల్ ఫేజ్‌లో ఈ నెల 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, అసోం అసెంబ్లీ ఎన్నికల చివరి లేదా మూడో విడత, అలాగే, పశ్చిమ బెంగాల్‌లో మూడో విడత ఎన్నికలు కూడా ఇదే రోజు జరగనున్నాయి. దీంతో రెండు రోజుల ముందు నుంచి ఎన్నికల సంఘం ప్రచారానికి తెరదించనుంది.

కేరళలో సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌తో పాటు బీజేపీ కూడా అన్ని (140) స్థానాల్లో తలపడుతున్నాయి. రాష్ట్రంలో 27 లక్షల అర్హులైన ఓటర్లున్నారు. ఈ నెల 6న ఈ మూడు పక్షాలు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులోనూ డీఎంకే, ఏఐఏడీఎంకేలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. పుదుచ్చేరిలో బలపరీక్షలో ఓడిపోయి అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్, దక్షిణాదిలో పాగా వేయలని బీజేపీ పోటీకి సిద్ధమయ్యాయి. అసోంలో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి విడత ఎన్నికలు మంగళవారం జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనుండా మూడో దశ మంగళవారమే జరగనున్నాయి. వీటితోపాటు పార్లమెంటు స్థానాలకూ ఉప ఎన్నికలు అదే రోజు జరగనుండటంతో ఆయా స్థానాల్లోనూ ప్రచారానికి నేడే చివరి రోజుగా మిలిగి ఉన్నది. నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది.

Advertisement

Next Story