- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: ప్రజలు నీ మొఖంపై ఉమ్మేసినా నీకు ఇంకా బుద్దిరాలేదా ..? వైసీపీ ఫైర్
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ అటు విపక్షాల నుండి.. ఇటు హేటర్స్ నుండి విమర్శలు ఎదుర్కుంటోంది. అయితే పార్టీపై వస్తున్న విమర్శలకు ఎప్పటికప్పుడు కౌటర్ ఇస్తూనే ఉంది. తాజగా సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావుపై వైసీపీ మండిపడింది.
వివరాల్లోకి వెళ్తే.. సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ట్విట్టర్ వేదికగా వైసీపీని నిందిస్తూ ఓ పోస్ట్ చేశారు. కరుడు గట్టిన అధికార దాహం ఎంత క్రూరంగా ఉంటుందో అని అన్నారు. అలానే మహానుభావుడు YSR గారు చచ్చి బతికిపోయారు గానీ.. బతికుంటే తన తమ్ముడి కంటే దారుణంగా చంపబడే వారేమో అని ఎద్దేవ చేశారు. కాగా ఈ ట్వీట్‌పై వైసీపీ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన నువ్వు కూడా నీతులు చెప్పడమేనా..? అంటూ ఎద్దేవ చేసింది. అలానే ప్రజలు నీ ముఖంపై ఉమ్మేసినా ఇంకా బుద్ధి వచ్చినట్లు లేదు అని నాగేశ్వరరావుపై మండిపడింది. అయినా ఎవరికి చెంచాగిరి చేయడం కోసం నువ్వు ఈ కబుర్లు చెప్తున్నావో అందరికీ తెలుసు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రెండు ట్వీట్లపై నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.