గ్రామాల్లో నైట్ స్కూల్స్.. స్టార్ హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం..!

by Satheesh |   ( Updated:2023-07-14 06:46:41.0  )
గ్రామాల్లో నైట్ స్కూల్స్.. స్టార్ హీరో దళపతి విజయ్ కీలక నిర్ణయం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా తన పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ చేసుకునే పనిలో విజయ్ బిజీగా ఉన్నారనే టాక్ వినిపిస్తున్నది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో విస్తృతంగా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన విజయ్.. రేపటి నుంచి అన్ని గ్రామాల్లో రాత్రిపూట బడులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దళపతి విజయ్ పేరుతో అన్ని చోట్లా నైట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలంటూ పిలుపునిచ్చారు.

రేపు మాజీ సీఎం కామరాజు విగ్రహానికి నివాళులు అర్పించి ఆ వెంటనే అన్ని ప్రభుత్వ స్కూళ్లలో నోట్ బుక్స్ పంపిణీ చేయబోతున్నారు. మక్కల్ ఇయక్కం సంస్థ జిల్లా అధ్యక్షులందరికీ ఈ మేరకు ఆదేశాలు వెళ్లాయి. విజయ్ తాజా నిర్ణయంతో ఆయన రాజకీయ రంగ ప్రవేశం మరింత బలపడుతున్నది. విజయ్ ఎప్పుడు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడా అని అతని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ స్పీడ్ చూస్తుంటే వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి దళపతి పొలిటికల్ కెరీర్ షూరూ కావడం ఖాయం అనే టాక్ వినిపిస్తున్నది.

Read More: విజయ్ ఒక పిచ్చి నటుడు షాకింగ్ ట్వీట్ చేసిన షారుఖ్ ఖాన్!

Advertisement

Next Story