వైసీపీ శ్రేణుల్లో చల్లారని విభేదాలు.. తొడ కొట్టి సవాల్ విసిరిన వైసీపీ నేత

by Disha Web Desk 3 |
వైసీపీ శ్రేణుల్లో చల్లారని విభేదాలు.. తొడ కొట్టి సవాల్ విసిరిన వైసీపీ నేత
X

దిశ, సూళ్లూరుపేట: సూళ్లూరుపేట నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్యకు పార్టీ నాయకుల ప్రవర్తన నియమావళి ఓ సమస్యగా మారింది. సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి సులూరుపేట పార్టీ పట్టణ అధ్యక్షులు కళాత్తూర్ శేఖర్ రెడ్డికి మధ్య పచ్చిగడ్డి వేసినా బగ్గుమని మండే తీరులో ఉంది.

ఇటీవలే సత్యనారాయణ రెడ్డి వర్గం సూళ్లూరుపేట ఓ కార్యక్రమంలో శేఖర్ రెడ్డిని టార్గెట్ చేసిన సంగతి విధితమే. ఆ విభేదాలు చల్లారక ముందే.. గురువారం కిలివేటి సంజీవయ్య నామినేషన్ వేసేందుకు జన సందోహం మధ్య ర్యాలీ సాగింది. పట్టణంలో వైసీపీ పార్టీ ప్రచార రథంపై స్థానికపార్టీ నాయకుడు, పార్టీ పట్టణ అధ్యక్షుడైన కలతూరు శేఖర్ రెడ్డి ప్రచార రథం పైకి ఎక్కారు.

ఈ దృశ్యాన్ని చూసిన సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి వాహనంపై నుంచి దిగాలని అనడంతోనే కోపోద్రోక్తుడైన శేఖర్ రెడ్డి అవమాన భావంతో ఊగిపోయాడు. అంతటితో ఊరుకోకుండా, తొడ కొట్టి సవాల్ విసిరి.. నువ్వా? నేనా? తేల్చుకుందాం రా అన్న రీతిలో వాహనంపై కదం తొక్కాడు. ఈ సన్నివేశాన్ని అందరూ చూసి అవాక్కయ్యారు.

శాసనసభ్యుడు కిలివేటి సంజీవయ్యకు ఇలాంటి సంఘటనలు ఎన్నికలవేళ తలనొప్పిగా మారాయి. ఎవరి వైపు నిలబడి నివారించాలా? ఎవరిని సర్దుకోమని చెప్పాలన్నా పాము.. కప్ప సామెతలా మారింది. గతంలో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకుని అందరూ కలసికట్టుగా పనిచేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సయోధ్య కుదిర్చిన అంతర్గత విభేదాలు ఇలాంటి సంఘటనలతో సమసి పోలేదనే తెలుస్తోంది.

సూళ్లూరుపేట నాయకులు, కార్యకర్తలు మా స్థానిక నాయకున్ని అవమానించటం ఏమిటి? సత్యనారాయణ రెడ్డి ప్రవర్తన తీరు ఏ మాత్రం సరిలేదని స్థానిక నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలతో జరగబోవు ఎన్నికల్లో కిలివేటి సంజీవయ్యకు కొంత సమస్య తప్పదని అంటున్నారు. ఏది ఏమైనా కడుపులో కత్తులు పెట్టుకున్న నాయకులు ఇలాంటి సంఘటనల్లో బహిర్గతం కావడం.. కోపాలను బాహాబాహీగా చూపించడంతో పార్టీ ఇమేజ్ దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.

సత్యనారాయణ రెడ్డి కిలివేటి సంజీవయ్యకు వెన్నుదన్నుగా ఉంటూ... ప్రతి కార్యక్రమంలో ముందుంటూ సంజీవయ్య గెలుపు కోసం కృషి చేస్తున్నారని అలాంటి నాయకున్ని ఈ సమయంలో దూరం పెట్టుకుంటే పార్టీకి తీరని నష్టం ఉంటుందని పార్టీ శ్రేణుల్లో కొందరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో అంతర్గత యుద్ధాలు, విభేదాలు పార్టీ విజయానికి అడ్డంకులుగా మారే పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అనుకుంటున్నారు.




Next Story

Most Viewed