దోపిడీ చరిత్ర మీది.. త్యాగాల చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది: నందికంటి శ్రీధర్

by Kalyani |   ( Updated:2023-07-18 16:17:58.0  )
దోపిడీ చరిత్ర మీది.. త్యాగాల చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది: నందికంటి శ్రీధర్
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: ‘కేటీఆర్ దోపిడీ చరిత్ర మీది, త్యాగాల చరిత్ర రాహుల్ ది.. నీవా మా నేతపై విమర్శలు చేసేది’ అంటూ మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు. రాజకీయ పార్టీలు, నాయకుల మధ్య విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం బీఆర్ఎస్ మంత్రులు, నేతలు సోయి లేకుండా దేశ కోసం ప్రాణాలను ఫణంగా పెట్టిన కాంగ్రెస్ అధినేతలపై ఇష్టానుసారం దిగజారుడు విమర్శలు చేయడం ఆక్షేపనీయం అని నందికంటి శ్రీధర్ కేటీఆర్ విమర్శలకు అభ్యంతరం తెలిపారు. జగిత్యాలలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం తూంకుంట జిల్లా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి కేటీఆర్ వాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా నందికంటి మాట్లాడుతూ.. పబ్ లు, క్లబ్ లు,డ్రగ్స్ సినిమావారితో దోస్తానా చరిత్ర కేటీఆర్ దని దుయ్యబట్టారు.

రాహుల్ గాంధీ కుటుంబ చరిత్ర ఎంతో త్యాగపూరితమైనదని దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబ చరిత్ర రాహుల్ గాంధీ కుటుంబానిది అని తెలిపారు. అంతేకాకుండా ప్రజల కోసం ముఖ్యంగా పేదల అభివృద్ది కోసం వందలాది సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి అట్టడుగు వర్గాల ఆర్థిక అభివృద్దికి బాటలు వేసిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గ్రామాలకు వచ్చే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed