లోక్‌సభ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ టెలిస్కోప్‌లో వెతికినా కనిపించదు.. అమిత్ షా

by Javid Pasha |
లోక్‌సభ ఎన్నికలయ్యాక కాంగ్రెస్ టెలిస్కోప్‌లో వెతికినా కనిపించదు.. అమిత్ షా
X

న్యూఢిల్లీ: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మాటలు దిగజారి పోయినట్లు ఉన్నాయని అన్నారు. రాహుల్ గాంధీ నేతగా మారిన సమయం నుంచి ఆ పార్టీ నేతల ప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రతినిధి ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలుపై దేశ ప్రజల స్పందన 2024 ఎన్నికల్లో చూస్తారని అన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ టెలిస్కోప్‌లో వెతికినా కనిపించదని ఎద్దేశా చేశారు. ప్రజలు బ్యాలెట్ బాక్స్‌తోనే ఆ పార్టీకి సమాధానం చెప్తారని అన్నారు. ప్రధాని మోడీకి ప్రపంచమంతా గౌరవం ఇస్తున్నారని షా చెప్పారు.

అలాంటి ప్రియమైన ప్రధాని పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఖండించదగినవని తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రతినిధి పవన్ ఖేరా ప్రధాని మోడీని ఉద్దేశించి నరేంద్ర గౌతమ్ దాస్ అని అన్నారు. ఆ వెంటనే నరేంద్ర దామోదర్ దాస్ మోడీ అంటూ సవరించుకున్నారు. దామోదర్‌దాస్ పేరు పెట్టుకున్నవారు గౌతమ్ దాస్ అవసరాలకు పనిచేస్తున్నారని సెటైర్లు వేశారు. ఆ తర్వాత గౌతమ్ దాస్.. దామోదర్ దాస్ పదాల పట్ల తను గందరగోళానికి గురైనట్లు చెప్పారు. ఈ వ్యాఖ్యలు కాస్తా ఇరు పార్టీల మధ్య చిచ్చురేపింది. హిండన్ బర్గ్- అదానీ వివాదంపై కాంగ్రెస్ అటువంటి వ్యాఖ్యలు చేసిందని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.


Advertisement

Next Story