మునుగోడులో Congress కు మరో బిగ్ షాక్.. ఆరుగురు ప్రజా ప్రతినిధులు జంప్

by Nagaya |   ( Updated:2022-08-19 06:10:27.0  )
మునుగోడులో Congress కు మరో బిగ్ షాక్..  ఆరుగురు ప్రజా ప్రతినిధులు జంప్
X

దిశ, చండూరు: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో అనేక ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. తాజాగా.. చండూరు మండల పరిధిలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, చండూర్ మున్సిపాలిటీ చెందిన ఒక కౌన్సిలర్ హైదరాబాద్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ సమక్షంలో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన ఉడతలపల్లి సర్పంచ్ కొరివి ఓంకారం, పడమటి తాళ్ల సర్పంచ్ మేకల వెంకన్న, గొల్లగూడెం సర్పంచ్ రాములు, కొండాపురం గ్రామానికి చెందిన కొండాపురం ఎంపీటీసీ చేపూరి యాదయ్య, కస్తాల ఎంపీటీసీ నాతాళ వణమ్మ, విష్ణువర్ధన్ రెడ్డి, చండూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్ అనంత మంగమ్మ, వీరందరూ బీజేపీలో చేరారు. మునుగోడులో అన్ని మండలాల నుండి వివిధ పార్టీల ప్రజా ప్రతినిధులు ఎక్కువగా చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Next Story