AP Politics: సజ్జలకు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఈసీకి మరో కంప్లైంట్

by Indraja |   ( Updated:2024-05-31 07:44:22.0  )
AP Politics: సజ్జలకు బిగుసుకుంటున్న ఉచ్చు.. ఈసీకి మరో కంప్లైంట్
X

దిశ వెబ్ డెస్క్: వైసీపీ కీలక నేత, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జలు రామకృష్ణారెడ్డి రెండు రోజుల క్రితం వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశమయ్యారు. ఈ సమావేసంలో సజ్జల మాట్లాడుతూ.. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్‌ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదని వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లకు ఉపదేశించిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు సజ్జల వ్యాఖ్యలపై బగ్గుమంటున్నాయి. ఇప్పటికే సజ్జలపై టీడీపీ న్యాయవాది గుడిపాటి లక్ష్మీనారాయణ, పార్టీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాడిపత్రి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా తాజాగా టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ నాయకత్వంలో పార్టీ నేతలు సజ్జలపై ఫిర్యాదు చేశారు.

నిబంధనలు నియమాలు పాటించేవాళ్లు ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లోద్దు, టీడీపీ, జనసేన కౌటింగ్ ఏజెంట్లు మీద తిరగబడేవాళ్లు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లుమాత్రమే కౌటింగ్‌కు వెళ్లాలని సజ్లల కౌంటింగ్ ఏజంట్లకు సూచించడంపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు ఈసీని కోరారు.

Advertisement

Next Story

Most Viewed