కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓ పొద్దు తిరుగుడు పువ్వు: మాజీ సీఎం కేసీఆర్

by Mahesh |   ( Updated:2024-04-13 15:23:59.0  )
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఓ పొద్దు తిరుగుడు పువ్వు: మాజీ సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 నియోజకవర్గంలోని ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందులో బాగంగా నేడు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌ కు మద్దతుగా కేసీఆర్.. ప్రజా ఆశీర్వాద భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ.. చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పై ఫైర్ అయ్యారు. ఆయన ఓ పొద్దు తిరుగుడు పువ్వు అని ఎద్దేవా చేశారు. అలాగే.. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఆయనకు.. ఏం తక్కువ చేశామని పార్టీ మరాడు. కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారు, అధికారం కోసమా, పదవుల కోసమా, పైరవీల కోసమా.. ప్రజలే గమనించాలని.. కేసీఆర్ అన్నారు.

Advertisement

Next Story