- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Poonam Kaur: ఏపీ రాజకీయాల్లో హాట్ బ్యూటీ.. మాజీ సీఎం జగన్‌పై పూనమ్ సంచలన ట్వీట్
దిశ వెబ్ డెస్క్: పూనమ్ కౌర్ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరంలేదు. తెలుగుతోపాటు పలు భాషల్లో నటించి తనకంటు ఒక గుర్తంపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ప్రస్తుతం వెండితెరపైన పెద్దగా కనిపించకపోయినా సోషల్ మీడియా వేదికపై ట్రెండింగ్‌లో ఉంటుంది ఈ ముదురు బామ. సినిమా ముచ్చట్లు, వ్యక్తిగత విషయాలను వెల్లడించడం అటుంచితే, ఏపీ రాజకీయాలకు సంబంధించి ఈ అమ్మడు చేసే ట్వీట్లు తెగ వైరల్ అవుతుంటాయి.
అర్థంకాని ట్వీట్లు పెట్టడంలో ఈ బ్యూటీని మించిన వారే లేరు అని అనడంలో అతిశయోక్తి లేదంటున్నాను ఈ తార ట్వీట్లు చూసిన నెటిజన్స్. ఇటీవల విడుదలైన 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై పూనమ్ స్పంధించింది. ఈ నేపథ్యంలో వై నాట్ 175 అని ఆంధ్రప్రదేశ్ హ్యాష్ ట్యాగ్‌ను జోడిస్తూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఎవరిని ఉద్ధేశిస్తూ చేశారో అర్థంగాక నెటిజన్స్ తలపట్టుకున్నారు.
అయితే తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటమిపై పూనమ్ ట్విట్టర్ వేదికగా స్పంధించింది. గత ఎన్నికల్లో జగన్ విజయానికి భార్య భారతి, తల్లి విజయమ్మ, సోదరి షర్మిల కీలకపాత్ర పోషించారు. భార్యగా భారతి, తల్లిగా విజయమ్మ, చెల్లిగా షర్మిల ఎవరికి వారు తమదైన శైలిలో జగన్‌కు సహనం, పట్టుదలను నేర్పారు. మళ్లీ కుటుంబం మొత్తం కలవాలని కోరుకుంటున్నా అని పూనమ్ ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.