- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్.. ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యానికి భారత్ పుట్టినిల్లని ప్రధాని మోడీ అన్నారు. పురాతన కాలం నుంచే భారత్ లో ప్రజాస్వామ్యం అమలులో ఉందని స్పష్టం చేశారు. అమెరికాలో జరుగుతున్న ‘‘సమ్మిట్ ఫర్ డెమోక్రసీ’’ కార్యాక్రమంలో ప్రధాని మోడీ వర్చువల్ గా మాట్లాడారు. ప్రజాప్రతినిధులను ఎన్నుకునే సంస్కృతి భారత దేశంలో మహాభారతం కాలం నుంచే ఉందని తెలిపారు. ఆ కాలంలో తమ ప్రతినిధిని ఎన్నుకోవడం పౌరుడి ప్రథమ విధిగా ఉండేదని అన్నారు. రాజ్యాధికారం అనేది ఒక్కరి చేతిలో ఉండేది కాదని, అధికార వినియోగంలో సలహాలు, సూచనలకు అధిక ప్రాధాన్యం ఉండేదని చెప్పారు.ఈ విషయాన్ని వేదాలు స్పష్టం చేస్తున్నాయని ప్రధాని తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలు, అవసరాలకు ప్రాతినిధ్యం ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ అనే నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని మోడీ చెప్పారు. ఈ దృక్పథంతోనే తాము నిరంతరం పని చేస్తున్నామని తెలిపారు. వ్యాక్సిన్ మైత్రి నినాదంతో ప్రపంచ దేశాలకు లక్షల కొద్దీ డోసులను పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఎన్నో సమస్యలున్నప్పటికీ ఆర్థికంగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.