Viral Photos: చీరకే సిగ్గేసింది.. వైఎస్ భారతి పసుపు రంగు డ్రెస్ ఫోటోలు వైరల్

by Indraja |   ( Updated:2024-04-26 11:38:50.0  )
Viral Photos: చీరకే సిగ్గేసింది.. వైఎస్ భారతి పసుపు రంగు డ్రెస్   ఫోటోలు వైరల్
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సోదరి షర్మిల పసుపు రంగు చీర ధరించడం పట్ల ముఖ్యమంత్రి , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యాలు తీవ్ర విమర్శలకు గురౌతున్నాయి. జగన్ తీవ్ర నిరాశలో స్వంత చెల్లి అనే విషయం మరచి, దిగరాజరుడు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. చంద్రబాబుతో షర్మిల కుమ్మక్కైయ్యారనే అర్ధం వచ్చేలా మాట్లాడదామనుకంటే అది కాస్తా రివర్స్ తన్నింది. దీంతో తిరిగి ఆ అంశం ఎక్కడా ప్రస్తావనకురాకుండా వైసీపీ నేతలు అందరూ జాగ్రత్త పడుతున్నారు.

ఇంతకీ జగన్ ఏమన్నారు.?

ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో జగన్ మాట్లాడుతూ, ‘‘ పసుపు చీర కట్టుకొని, వారి ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లే మీరు వైఎస్సార్ వారసులా లేక మరి ఆ చంద్రబాబు వారసులా?’’ అని జగన్ ప్రశ్నించారు. ఇదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. దీనితో చెల్లి చీర రంగు గురించి బహిరంగ సభలో అన్న మాట్లాడడం కంటే మించిన దిగజారుడు తనం ఏ ముంటుందని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గట్టిగా కౌంటర్ ఇచ్చిన షర్మల

అన్న తన చీరపై చేసిన వ్యాఖ్యలకు షర్మిల గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వేల మంది వున్న సభలో సొంత చెల్లెలు వేసుకున్న బట్టల మీద ప్రస్తావన చేస్తారా ఎవరైనా? అని నిలదీశారు. సొంత చెల్లెలు అని చూడకుండా జగన్ ఇంగితం మరచి మాట్లాడుతున్నారని, జగన్‌కు అసలు సంస్కారమే లేదని దుయ్యబట్టారు. ‘‘అవును చేను పసుపు చీర కట్టుకున్నా.. అయితే ఏంటీ.? పసుపు రంగుపై చంద్రబాబుకు ఏమైనా పైటెంట్ రైట్ వుందా? జగన్ రెడ్డి మరచిపోయాడనుకొంటా...సాక్షి ఛానల్ మొన్నట పసుపు రంగులోనే వుండేది. పసుపు మంగళకరమైన రంగు అని స్వయంగా నాడు వైఎస్సార్ చెప్పారు’’ అని గుర్తుచేశారు.

భారతి పసుపు డ్రస్ ఫోటోలు వైరల్

జగన్ సతీమణి వైఎస్ భారతి పసుపు రంగు డ్రస్ వేసుకొన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోదరి షర్మిలను పసుపు రంగు చీర కట్టుకొన్నందుకు తప్పు పట్టిన జగన్, పసుపు రంగు డ్రెస్ వేసుకున్న భార్యను ఏమంటారు? అంటూ ఆ ఫోటోలనుపోస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. కొందరు మహిళలైతే చీరలో నిండుగా తెలుగింటి ఆడపడుచులా కనిపించే సోదరిని అలా ఎలా అనగలిగారంటూ తప్పుపట్టారు.

ఈ రోజు షర్మల చీర గురించి మాట్లాడిన జగన్ పొరపాటును తల్లి విజయమ్మ పసుపు చీర కట్టుకుంటే కూడా ఇలాగే అంటారా? అంటూ నిలదీశారు. ఇంతకంటే దిగజారడానికి ఇంకే మిగిలింది జగన్? అని మరికొందరు అవేదన వ్యక్తం చేశారు.

Read More..

టీడీపీకి యనమల కృష్ణుడు రాజీనామా

Advertisement

Next Story