Netizens fired on CM Jagan: సీఎం జగన్ ట్వీట్ వైరల్.. నెటిజన్స్ ఫైర్..

by Indraja |   ( Updated:2024-04-28 12:43:56.0  )
Netizens fired on CM Jagan: సీఎం జగన్ ట్వీట్ వైరల్.. నెటిజన్స్ ఫైర్..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో నేతల మధ్య మాటలు తూటాల్లా పెలుతున్నాయి. అయితే సాక్ష్యాలు లేకుండా నేతలు నోరుజారితే నేటిజన్స్ చేయ్యి జారుతున్నారు. సోషల్ మీడియా వేదికగా వాళ్ళు పెట్టే ప్రతి పోస్ట్‌కి నెటిజన్స్ స్పందిస్తున్నారు.

తప్పు ఎవరి పక్కన ఉంటే వారిని ప్రశ్నిస్తున్నారు. నేతలకి కొందరు అభిమానులు సపోర్ట్ చేసినా, చాలామంది నెటిజన్స్ తప్పును తప్పు అని చూపిస్తూ నిలదీస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెటిజన్స్ ఫైర్ అయ్యారు.

వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఉద్దేశించి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌లో సంపాదన సృష్టిస్తాం సృష్టిస్తాం అంటూ బీరాలు పలుకుతున్న చంద్రబాబు 14 ఏళ్లుగా సీఎంగా ఉన్నప్పుడు ఏ స్థాయిలో సంపద సృష్టించాడో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతుంది.

ఆ 14 ఏళ్లలో ప్రతి ఏడాది రెవెన్యూ లోటే కనిపిస్తోంది. మరి సంపద సృష్టించింది ఎక్కడ చంద్రబాబు అని ప్రశ్నిస్తూ ఒక వీడియోని వైయస్ జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అయితే ఆ వీడియో చూసిన నెటిజన్స్ ముఖ్యమంత్రిపై విమర్శల జల్లు కురిపిస్తున్నారు.

చెల్లిని కుర్చోబెట్టి ఇలాంటి తప్పుడు లెక్కలు చెప్పే, ఆస్తిలో ఉన్న పొలం పుట్ర, నగా నట్ర, గొడ్డు గోదాలో పొలం నాకు పుట్ర నీకు, నగలు నాకు నట్ర నీకు, గొడ్లు నాకు గోదా నీకు అని చెప్పుంటాడు అని, ఇలాంటి తప్పుడు లెక్కలు వెయ్యబట్టే నిన్ను 16నెలలు బొక్కలో వేసారు.. ఐనా నీకింకా సిగ్గు రాలేదు.

తమరి పాలన గురించి ప్రజల అభిప్రాయం తెలుసుకోండి.. అంతేగానీ పనికిమాలిన మాటలు ఎందుకో..?? అని, నీ పని అయిపోయింది అన్న.. పడుకో, ఇంక ఏం ఉందిలే అని కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story