ముద్రగడకు ముచ్చెమటలు పట్టిస్తున్న కన్న కూతురు.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో వీడియో వైరల్..

by Disha Web Desk 3 |
ముద్రగడకు ముచ్చెమటలు పట్టిస్తున్న కన్న కూతురు.. పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా మరో వీడియో వైరల్..
X

దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైసీపీ నేత ముద్రగడకు తన కన్న కూతురు క్రాంతి పట్టపగలే చుక్కలు చూపిస్తోంది. తండ్రి వైసీపీలో ఉంటే.. కూతురు జనసేనకు మద్దతుగా నిలుస్తోంది. ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా మరో వీడియోను ముద్రగడ కూతురు క్రాంతి విడుదల చేశారు.

ఇటీవల తాను విడుదల చేసిన వీడియోకి ప్రజలు ఇచ్చిన స్పందన తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని ముద్రగడ కుమార్తె క్రాంతి పేర్కొన్నారు. నెటిజన్స్ తన వీడియోకి చేసిన పాజిటివ్ కామెంట్స్‌తో తాను చాలా ఇన్స్పైర్ అయినట్లు తెలిపారు. కాగా పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం మన అదృష్టం అని పేర్కొన్నారు. ఏ నియోజకవర్గంలో అయితే ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తారో, ఆ నియోజకవర్గం బాగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంను అభివృద్ధి చేస్తారనే నమ్మకం తనకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక గత పదేళ్లుగా పవన్ కళ్యాణ్ పార్టీని తన సొంత డబ్బులతో నడుపుతూనే రైతులకు అండగా ఉన్నారని ఆమె తెలిపారు. పవన్ కళ్యాణ్‌కు అధికారం లేనప్పటికీ ఆయన ప్రజల సమస్యల పట్ల స్పందించిన తీరు చాలా బాగుందని క్రాంతి స్పష్టం చేశారు.

అలాంటి నాయకులకు అధికారం వచ్చి అసెంబ్లీలో అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి అని ప్రజలకు తెలిపారు. పాజిటివ్ పాలిటిక్స్ చేసే పవన్ కళ్యాణ్‌న్ను అందరం కలిసి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్‌న్ను అసెంబ్లీకి పంపించేందుకు తన వంతు కృషి తాను బలంగా చేస్తానని.. అలానే అందరూ కూడా పవన్ కళ్యాణ్‌కు అండగా ఉంటారని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed