- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Marri Shashidhar Reddy మర్రి శశిధర్ రెడ్డికి షాక్..లీగల్ నోటీసులు జారీ
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇటీవల మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి క్యాన్సర్ సోకిందని, అది నయం చేయలేని స్థితికి చేరుకుందని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
మాణిక్కం ఠాగూర్, రేవంత్ రెడ్డికి ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో, శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మాణిక్కం ఠాగూర్ తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ని అమ్ముకున్నానంటూ చేసిన వ్యాఖ్యలకు పరువు నష్టం దావా వేస్తానని..నోటీసులు తీసుకునేందుకు రెడీగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా, అసత్య ఆరోపణలు చేసినందుకు మిమ్మల్ని మధురై కోర్టు వైపు పరుగులు పెట్టిస్తానని శశిధర్ రెడ్డి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనపై మర్రి శశిధర్ నిరాధారమైన ఆరోపణలు చేయడంపై మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు ఇచ్చారు. ఇక, ఈ నోటీసులపై శశిధర్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.