- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Nara Lokesh: కష్టాలు వింటూ..కన్నీళ్లు తుడుస్తూ.. నారా లోకేష్ భరోసా
దిశ, మంగళగిరి: ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా నిలిచేందుకు రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. ప్రతి రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఎటువంటి ఆంక్షలు లేకుండా నేరుగా ఉండవల్లి నివాసానికి చేరుకుని యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రజలు చెబుతున్న సమస్యలను సావధానంగా వింటున్న యువనేత లోకేష్ వారందరికీ మనోధైర్యాన్నిస్తూ అండగా ఉంటానని భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను ఆయా శాఖల అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు.
నాటికి నేటికి ఎంత తేడా..
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివసించే ఉండవల్లి నివాసంలోనే లోకేష్ ఉంటున్నారు. సాధారణంగా సీఎం నివాసం వద్ద కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఉంటుంది. గతంలో జగన్ నివాసం వద్ద అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ల రోడ్డునే బ్లాక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు నివాసం వద్ద ప్రజలకు ఎటువంటి ఆంక్షలు లేవు. వందలమంది ప్రజలు సమస్యలు చెప్పుకునేందుకు ఉండవల్లి నివాసానికి విచ్చేసినప్పటికీ ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి లోకేష్ ప్రతి ఒక్కరినీ కలుసుకుని వారి సమస్యలు వింటున్నారు.
మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని ఎన్నికల సమయంలో చెప్పిన మాటను ప్రజాదర్బార్ ద్వారా నిరూపిస్తున్నారు. మంగళవారం ఉదయం కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు లోకేష్‌ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకున్నారు.
వితంతు పెన్షన్ కోసం..
మంగళగిరికి చెందిన 70 ఏళ్ల గుండూరు వెంకట సుబ్బమ్మ తనకు వితంతు పెన్షన్ మంజూరు చేయించి ఆదుకోవాలని లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లి సుందరయ్య నగర్‌కు చెందిన బీ దుర్గా ప్రసాద్ తమకు ఇంటిపట్టా ఇప్పించడంతో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. మంగళగిరి 19వ వార్డుకు చెందిన చిల్లపల్లి వీరమ్మ తల్లిలేని తన మనవడి చదువుకు ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
తొలగించిన ఒంటరి మహిళ పెన్షన్‌ను పునరుద్ధరించాలని మంగళగిరి 12వ వార్డుకు చెందిన టి.జయమణి కోరారు. చేనేత కార్మికురాలైన తనకు ఇంటి స్థలం మంజూరుచేయించి ఆదుకోవాలని మంగళగిరి కొప్పురావుకాలనీకి చెందిన గంజి లత నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
న్యాయం చేయాలని వినతి..
మీ-సేవ వ్యవస్థపై ఆధారపడిన వారికి తగిన న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ మీ-సేవ సంస్థ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో నిరసన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులపై నమోదు చేసిన 1600 కేసులను రద్దు చేయాలని ఏపీ సీపీఎస్ ఎంప్లాయిస్ అసోసిషయేన్ ప్రతినిధులు నారా లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయుష్మాన్ హెల్త్ క్లినిక్‌లలో పని చేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను రెగ్యులర్ చేయడంతో పాటు, 23 శాతం వేతన సవరణ, 9 నెలల జీతాల పెండింగ్ వంటి సమస్యలను పరిష్కరించాలని ఏపీఎంసీఏ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
బీటెక్ చదివిన తన కుమారుడికి ఉద్యోగం కల్పించాలని మంగళగిరికి చెందిన వి.దుర్గామల్లేశ్వరి కోరారు. ఆయా సమస్యలను విన్న నారా లోకేష్.. సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.