తెలంగాణ ఏర్పాటు అయ్యాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమే: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

by Kalyani |   ( Updated:2023-06-06 00:17:14.0  )
తెలంగాణ ఏర్పాటు అయ్యాక బాగుపడింది కేసీఆర్ కుటుంబమే: కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కుటుంబం కొడుకు, కూతురు, అల్లుడు బాగుపడి కోట్లు సంపాదించారు కానీ, తెలంగాణ ప్రజలకు మాత్రం ఎలాంటి మేలు జరుగలేదని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ ప్రవాస యోజన కార్యక్రమం సోమవారం క్లాసిక్ గార్డెన్ లో కంటోన్మెంట్ బోర్డు సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ, మహంకాళి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకుముందు కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని కంటోన్మెంట్ వర్క్ షాప్ వద్ద నిర్మిస్తున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణ పనులను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, కంటోన్మెంట్ బోర్డు సి ఈ ఓ మధుకర్ నాయక్ తో కలిసి పరిశీలించారు.

అనంతరం క్లాసిక్ గార్డెన్ లో కంటోన్మెంట్ ప్రాంతంలోని వివిధ కాలనీల వెల్ఫేర్ అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్, కాలనీల ప్రతినిధులతో ముఖా ముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారు అందించిన వినతి పత్రాల ను స్వీకరిస్తూ వారితో మాట్లాడారు. ఇందులో భాగంగా ఖేలో ఇండియా నిధుల నుంచి కంటోన్మెంట్ ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో సింథటిక్ స్టేడియంను నిర్మించి అందుబాటులోకి తీసుకురావాలని కంటోన్మెంట్ ప్రాంత స్పోర్ట్స్ అసోసియేషన్ లు, వివిధ క్రీడలలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు, మాజీ అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు తెలంగాణ రాష్ట్ర ఫుట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు పాల్గొని , అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడాకారుడు, విన్సన్ పాల్, ఫిజికల్ డైరెక్టర్, సిఎంఆర్ స్పోర్ట్స్ అకాడమీ స్పోర్ట్స్ డైరెక్టర్, జాతీయ క్రీడాకారుడు సుధీర్ ల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వినతి పత్రాన్ని అందించారు.

సానుకూలంగా స్పందించిన ఆయన దీన్ని ఖేలో ఇండియా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లి స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ .. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ దేశాభివృద్ధికి చేస్తున్న కృషిని వివరించారు. కరోనా వైరస్ కష్టకాలంలో విపత్తులను ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ధీటుగా ఎదుర్కొని వ్యాక్సిన్ తయారు చేసి లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన ఘనత మన ప్రధానికే దక్కిందని అనేక విషయాలను మంత్రి వెల్లడించారు. తెలంగాణలో సిఎం పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయ రామారావు, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ అధికారి, బిజెపి పార్టీ నాయకుడు ఆరేపల్లి పరశురామ్, సుస్మిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మద మల్లిఖార్జున్, బి.ఎన్. శ్రీనివాస్,కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్, గంజి వైశాలి వంశీ, అజిత్ కళ్యాణ్, కాంపల్లి శ్రీకాంత్, విజయ్,ఉత్తరయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed