రాసలీలల లీడర్లకు KCR ఝలక్.. కట్ చేస్తానని వార్నింగ్

by Nagaya |   ( Updated:2022-11-27 04:42:47.0  )
రాసలీలల లీడర్లకు KCR ఝలక్.. కట్ చేస్తానని వార్నింగ్
X


టీఆర్ఎస్‌లో కామాంధులు

చాటుమాటు యవ్వారాలు నడిపే టీఆర్ఎస్​నేతలకు ఆ పార్టీ షాక్​ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ పరువు తీసేలా వ్యవహరించడంతో పార్టీ అధినేత సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రజాప్రతినిధుల జాబితా జిల్లాలవారీగా సేకరించినట్టు సమాచారం. వారికి కౌన్సిలింగ్​ఇచ్చి ఇకపై పద్ధతి మార్చుకోకపోతే టికెట్​కట్​చేస్తామని వార్నింగ్​ఇవ్వనున్నారు. ఇప్పటికే ముగ్గురు మంత్రులకు సీరియస్‌గా హెచ్చరించినట్టు తెలుస్తున్నది.

దిశ, తెలంగాణ బ్యూరో: కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల తీరుతో పార్టీ పరువు పోతున్నదని టీఆర్ఎస్​ ఆందోళన చెందుతున్నది. టీఆర్ఎస్ మహిళ లీడర్లు, కార్యకర్తలతో చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్న వారిపట్ల సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. ఇప్పటికైనా వారందరూ తీరు మార్చుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. కొన్ని రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలపై నిఘా ఉన్న విషయం బహిరంగ రహస్యమే. మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలో ఏం చేస్తున్నారు? ఎవరి ఇంటికి వెళ్తున్నారు? ఎక్కడ లంచ్ చేస్తున్నారు? ఎవరితో కలిసి డిన్నర్ చేస్తున్నారు? సెక్యూరిటీ లేకుండా ఎటు వెళ్తున్నారు? ఇలా ప్రతి కదలికపై ఎప్పటికప్పుడు రిపోర్టులు ప్రగతిభవన్‌కు చేరుతాయని ప్రచారంలో ఉంది. అయితే కొద్దిమంది మంత్రులు, ఎమ్మెల్యేల కొనసాగిస్తోన్న 'ఆ వ్యవహారాలు' పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రమాదం ఉన్నట్టు పార్టీ లీడర్లు భావిస్తున్నారు. వారికి సన్నిహితంగా ఉండే లీడర్ల ద్వారా పద్ధతి మార్చుకోవాలని, లేకపోతే టికెట్ కోత తప్పదని సంకేతాలు పంపినట్టు పార్టీలో చర్చ జరుగుతున్నది.

అక్రమ సంబంధాలపై గుర్రు

లీడర్ల అక్రమ సంబంధాలపై ప్రజలు గుర్రుగా ఉండటంతో పాటు చులకనగా చూస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేల పేర్లు చెప్పగానే ప్రజలు సెటైర్లు వేస్తున్నారు. ఏ గ్రామంలో ఏ లీడరుతో అక్రమ సంబంధాలు ఉన్నాయో లెక్కలతో పాటు వివరిస్తున్నారు. ఈ విషయాలను ప్రజలు కేవలం నవ్వుకోడానికి తీసుకుంటే పర్లేదు. కానీ, మళ్లీ టికెట్ ఇస్తే ఓటు వేస్తారా? అనే ప్రశ్నకు 'ఛీ' కొడుతున్నట్టు ప్రగతిభవన్‌కు సన్నిహితంగా ఉండే లీడర్లు ఆవేదన చెందుతున్నారు. ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికలో పార్టీ లీడర్ల అక్రమ సంబంధాలు పెద్ద సమస్యగా మారిన విషయాన్ని పార్టీ పెద్దలు గుర్తించినట్టు చర్చ జరుగుతున్నది. అందుకే తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్టు చెప్తున్నారు.

ముగ్గురు మంత్రులకు వార్నింగ్

చాటుమాటు వ్యవహారాలపై ముగ్గురు మంత్రులకు పార్టీ పెద్దలు వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారంలో ఉంది. అందులో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు, దక్షిణ తెలంగాణకు చెందిన మరో మంత్రి ఉన్నట్టు తెలిసింది. ఓ మంత్రి చాంబర్‌లో ఎప్పుడూ మహిళలు ఉండటంపై కూడా నిఘా వర్గాలు రిపోర్టు ఇచ్చినట్టు సమాచారం. ఓ మంత్రి జిల్లా పర్యటనలో ఉన్నా హైదరాబాద్‌లో తనకు కావాల్సిన మహిళ లీడర్లకు స్పెషల్ ఆరేంజ్ మెంట్స్ చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడాన్ని నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. పార్టీ పెద్దల వద్ద ఆ ముగ్గురి మంత్రుల పూర్తి చిట్టా ఉన్నట్టు సమాచారం. మంత్రుల అధికారిక పర్యటనల్లో ఆ మహిళలు ఎందుకు ఉన్నారు? వారితో కలిసి ఎందుకు తీర్థయాత్రలకు వెళ్లారు? పార్టీ ప్రోగ్రామ్‌లో ఆ మహిళ లీడర్ పక్కన ఎందుకు కూర్చున్నారు? రివ్యూ మీటింగ్ లోనూ ఏ హోదాలో కూర్చోపెట్టుకున్నారు? అనే విషయాలపై పార్టీ పెద్దలు ప్రశ్నలు వేస్తూ, క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది.

ఢిల్లీ టూర్‌లో మంత్రి ఎంజాయ్

ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి వ్యవహార తీరు తట్టుకోలేక పోతున్నట్టు ఆ జిల్లా లీడర్లు చెప్తున్నారు. ఆయన ఎటు వెళ్లినా ఆ మహిళ అక్కడ కనిపిస్తున్నదని అంటున్నారు. ఆ మధ్య ప్రభుత్వ పనిమీద మంత్రి ఢిల్లీకి వెళ్తే సదరు మహిళ అక్కడ కూడా కనిపించినట్టు చెప్తున్నారు. అయితే మునుగోడు బై ఎలక్షన్‌లో ఆ మంత్రి ప్రచారంలో ఉంటే అక్కడ కూడా సదరు మహిళ ప్రత్యక్షమైందని అంటున్నారు. తను బస చేస్తున్న ఫాంహౌజ్‌లో ప్రత్యేక సదుపాయాలు ఆ మహిళకు ఏర్పాటు చేయడంపై ప్రచారానికి వెళ్లిన కార్యకర్తలు ఇదేం పద్ధతి అని చర్చించుకున్నట్టు తెలిసింది. అయితే మంత్రి తీరు ఇంట్లో కూడా తెలియడంతో ప్రస్తుతం కుటుంబంలో పెద్ద పంచాయితీ జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. ఈ విషయం మొత్తం ప్రగతిభవన్‌కు చేరిందని, సదరు మంత్రికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది.

జిల్లాలవారీగా జాబితా..

ప్రగతిభవన్‌కు అందిన జాబితాలో నల్లగొండకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం. అందులో ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఓ జడ్పీటీసీతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను కూడా పార్టీ పెద్దలకు పంపినట్టు ప్రచారంలో ఉంది. మరో ఎమ్మెల్యేకు ఇదే చివరి ఎన్నిక, ప్రస్తుతం గెలిపించుకోవడమే పెద్ద సవాలుగా మారిందని చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు జాబితాలో ఉన్నట్టు తెలిసింది. వారికి ఇప్పటికే క్లాస్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులను కూర్చోపెట్టి మరీ హెచ్చరించినట్టు సమాచారం. ఖమ్మంలో ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఉమ్మడి కరీంనగర్‌లో ఇద్దరు ఎమ్మెల్యేలను పదే పదే హెచ్చరిస్తోన్న తీరు మారడం లేదని సమాచారం. ఉమ్మడి మెదక్‌కు చెందిన ఓ ఎమ్మెల్యేకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో కాస్త దారిలోకి వచ్చినట్టు తెలిసింది. అదిలాబాద్ జిల్లాలో ఓ ఎమ్మెల్యేకు కొడుకు ముందే క్లాస్ ఇచ్చారని.. నిజామాబాద్ జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలకు కౌన్సిలింగ్ ఇచ్చినా, మళ్లీ పాత పద్ధతిలో ఉన్నట్టు చర్చ జరుగుతున్నది. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఇతర రాష్ట్రాల్లో గుట్టుగా కొనసాగిస్తున్న విషయాన్ని కూడా నిఘా వర్గాలు గుర్తించినట్టు తెలిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు లోకల్‌లో కాకుండా ఫారిన్ టూర్లలో పని కానిస్తున్న విషయాన్ని ఇంటలిజెన్స్​అధికారులు పసిగట్టినట్టు సమాచారం.

Read more:

భర్తకేమో మోడలింగ్ అని చెప్పింది.. చేసేది మాత్రం ఆ పని!

ఎన్నికల వేళ కేసీఆర్‌కు కొత్త టెన్షన్.. పైసల కోసం ఎమ్మెల్యేల ఒత్తిడి

Advertisement

Next Story