- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూ.ఎన్టీఆర్‌ను ఇరుకున పెట్టిన YS షర్మిల!
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అంశంపై రాజకీయ దుమారం చెలరేగింది. జగన్ సర్కార్ అనవసరమైన ఇష్యూను నెత్తిన వేసుకుంటోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి కొనసాగుతున్న హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్సార్ పేరు పెట్టడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంలో ఎన్టీఆర్ సంతానం రియాక్షన్ ఆలస్యంగా ఉందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిత్యం ఎన్టీఆర్ నామజపం చేస్తున్న నందమూరి వారసులు ఇలా ఆలస్యంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది. గురువారం ఒక్కొక్కరు స్పందిస్తూ వస్తున్నా జూనియర్ ఎన్టీఆర్ వైఖరి ఇటు టీడీపీతో పాటు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిరాశ కలిగించేలా ఉందంటున్నారు.
షర్మిలకు లేని మొహమాటం ఎన్టీఆర్‌కు ఎందుకు?
జగన్ ప్రభుత్వం తీసుకున్న యూనివర్సిటీ పేరు మార్పు అంశాన్ని సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు తప్పుపట్టారు. ఈ విషయంలో ఎలాంటి మోహమాటాలకు వెళ్లకుండా నేరుగానే ఈ నిర్ణయాన్ని ఆమె ఖండించారు. ఇలా పేర్లు మార్చడం సరికాదన్నారు. ఇదే అంశంపై జూ.ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందింస్తూ... 'ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు.. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు' అంటూ ట్వీట్ చేశారు. ఇది ఈ ట్వీట్ ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పిస్తోందట. ఈ ట్వీట్ చూసిన వారంతా ఎన్టీఆర్ వైఖరి 'నొప్పింపక తా నొవ్వక..' అన్న చందంగా వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరునే ఖరారు చేసినప్పటికీ తన సోదరుడిని నిర్ణయాన్ని షర్మిల ఖండిస్తే జూ.ఎన్టీఆర్ ఎందుకిలా స్మూత్‌గా రియాక్ట్ అయ్యారనేది అంతుచిక్కడం లేదనే చర్చ జరుగుతంది.
గతంలోనూ ఇంతే:
గతంలో నందమూరి ఆడపడచు విషయంలో వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలను జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. ఇలాంటి కామెంట్స్ సరికాదంటూ మెతక వైఖరిలోనే రియాక్ట్ అయ్యారనే విమర్శలు వచ్చాయి. అయితే జూ.ఎన్టీఆర్ ఈ అంశంలో కాస్త మెత్తగా స్పందించడాన్ని కొందరు టీడీపీ నేతలు మాత్రం తీవ్రంగా తప్పుబట్టారు. కుటుంబసభ్యులపై ఆ రకమైన వ్యాఖ్యలు చేసిన వారిపై యంగ్ టైగర్ ఈ రకంగా స్పందించడం ఏంటనే మాట వినిపించింది. తాజా ఇష్యూలో మరోసారి ఇదే వైఖరి కనపరిచారనే చర్చ జరుగుతోంది. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు అని ఖండించారు. బాలకృష్ణ, రామకృష్ణ, పురందేశ్వరీ సైతం జగన్ ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
NTR హెల్త్ యూనివర్సిటీ పేరును తొలిగించడంపై స్పందించిన Jr. NTR
ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. Nandamuri Kalyan Ram కీలక వ్యాఖ్యలు