- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Jr NTR రాజకీయాల్లోకి వస్తున్నారా.. వస్తే Kodali Nani ఎటువైపు?
దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్, మాజీ మంత్రి కొడాలి నానికి మధ్య సాన్నిహిత్యం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ సినిమాలకు కూడా ఆయన ప్రొడ్యూస్ చేశారు. అయితే కొడాలి రాజకీయాల్లోకి రావడానికి ఎన్టీఆర్ హెల్ప్ చేశారని టాక్ ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబును ఒప్పించి మరీ గుడివాడ అసెంబ్లీ టికెట్ ఇప్పించారని సమాచారం. అయితే చంద్రబాబుతో గొడవల కారణంగా నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన వైసీపీ గూటికి చేరడంలో ఎన్టీఆర్ హస్తం ఉందని రాజకీయ గుసగుసలు ఉన్నాయి.
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్‌కు సన్నిహితుడే. ఆయన కూడా నానిలాగే తెలుగుదేశం పార్టీకి రివర్స్ అయ్యి వైసీపీ పంచన చేరారు. అయితే ఎన్టీఆర్‌కు సన్నిహితంగా ఉండి కూడా వీరు చంద్రబాబును టార్గెట్ చేసి ఘాటు విమర్శలు చేస్తుంటారు. దీనిపై ఎన్టీఆర్ స్పందించక పోవడం టీడీపీ అభిమానుల్లో నిరాశను కలిగించే అంశమే. ఇటీవల చంద్రబాబు భార్య భువనేశ్వరిపై నానీ, వంశీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వీరిపై స్పందించిన తీరు టీడీపీ అభిమానులకు బాధను కలిగించింది. స్వంత మేనత్తను దూషిస్తే ఇలాగేనా స్పందించేది అంటూ అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నా ఏదో ఒక రూపంలో ఆయనపై రాజకీయ రంగు పులుముతూనే ఉన్నారు. బీజేపీ అగ్రనాయకుల్లో ఒకరైన అమిత్ షా.. జూనియర్‌ని కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నారన్న గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే వంశీ, నానీ, ఆయనతో పాటు వస్తారా లేదా అన్నది డౌటే. అయితే గతంలో కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. దీన్ని బట్టి చూస్తే నాని కూడా ఎన్టీఆర్ రావాలని కోరుతున్నట్లుగా ఉంది. వంశీ కూడా ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. వైసీపీ నానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మంత్రిని కూడా చేసింది. అందుకే తాను పార్టీ మారే ప్రసక్తే లేదని గతంలో కొడాలి తేల్చిచెప్పారు. అయితే రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి వస్తే నాని తప్పకుండా ఎన్టీఆర్‌కు సపోర్ట్ చేస్తారని, వారిద్దరి మధ్య బంధం అలాంటిదంటూ ఎన్టీఆర్ అభిమానులు వాదిస్తున్నారు.