- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Metro: మెట్రో సెకండ్ ఫేజ్ సవాళ్లతో కూడుకున్నది.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: మెట్రో రైలు రెండో దశ నిర్మాణం చాలా సవాళ్లతో కూడుకున్నదని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి(Metro MD NVS Reddy) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో రెండో దశ(Metro Second Phase) నిర్మాణం(Construction)పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రో రైలు సెకండ్ ఫేజ్ పై సీఎం(CM Revanth Reddy)తో సుదీర్ఘంగా చర్చించామని, రెండో దశలో దాదాపు 76 కిలో మీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఇది చాలా సవాళ్లతో కూడుకున్నదని, మెట్రో రెండో దశ నిర్మాణం చేపట్టేందుకు ప్రైవేటు సంస్థలేవి ముందుకు రావడం లేదని చెప్పారు. మెట్రో రైలు మొదటి దశ(Metro First Phase) నిర్మాణంలో ఎల్ అండ్ టీ(L&T) సంస్థకు భారీగా నష్టం(Huge Losses) వాటిల్లిందని, ఈ అనుభవంతో ప్రైవేటు సంస్థలు ముందుకు రావడానికి భయపడుతున్నాయని అన్నారు.
ఫస్ట్ ఫేజ్ మెట్రో వల్ల ఎల్ అండ్ టీకి రూ.6 వేల కోట్ల నష్టం వచ్చిందని, ఏడాదికి రూ.1300 కోట్ల నష్టాన్ని ఎల్ అండ్ టీ సంస్థ భరిస్తోందని తెలిపారు. మిగతా రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలే మెట్రోను నిర్వహిస్తున్నాయని, మెట్రో నిర్మాణానికి అప్పులు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా ఆసక్తి చూపడం లేదని వివరించారు. మెట్రోను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించాలని సీఎంకు సూచించినట్లు చెప్పారు. రెండో దశ మెట్రో నిర్మాణానికి రూ.24,269 కోట్లు అవసరం అవుతున్నాయని, ఇందులో 48 శాతం నిధులు జైకా(JICA) ద్వారా సమకూరుతున్నాయని వెల్లడించారు. మంత్రివర్గ ఆమోదం(Cabinet Approval) తర్వాతే కేంద్రానికి సిఫారసులు పంపామని, కేంద్రం నుంచి అనుమతులు రాగానే రెండో దశ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇక ప్రజల సహకారం(Public Cooperation) ఉంటే రెండో దశను శరవేగంగా పూర్తి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి సూచించారు.