నాకు టికెట్ ఇవ్వకుంటే 25 సీట్లు గల్లంతే.. BJP అధిష్టానానికి మాజీ సీఎం హెచ్చరిక

by GSrikanth |
నాకు టికెట్ ఇవ్వకుంటే 25 సీట్లు గల్లంతే.. BJP అధిష్టానానికి మాజీ సీఎం హెచ్చరిక
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది. పార్టీల మధ్య నేతల జంపింగ్‌లు పూటకో ట్విస్ట్ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో తనకు టికెట్ నిరాకరిస్తే పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇవాళ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష్‌తో సమావేశమైన ఆయన నేను చెప్పాల్సింది ప్రతిదీ కేంద్ర మంత్రికి వివరించాను. ఇక వారి ఇష్టం అన్నారు. టికెట్ విషయంలో తానింకా ఆశాజనకంగానే ఉన్నానని పార్టీ హైకమాండ్ పై నాకు నమ్మకం ఉందన్నారు. ప్రస్తుతాని తాను ఇతర ఏ పార్టీతో సంప్రదింపులు జరపలేదని చెప్పారు.

హుబ్బళ్లీ టికెట్ ఆశిస్తున్న ఆయన తనకు టికెట్ రాకపోవడంపై పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను సైతం ఇదివరకు ఓ సారి కలిసి వచ్చారు. పార్టీ అధిష్టానం తన సీటు విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆదివారం వరకు వేచి చూస్తానని ఆ తర్వాత తన భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని ఇప్పటికే వెల్లడించారు. ఒకవేళ తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోతే నార్త్ కర్ణాటకలో 20-25 స్థానాలు కమలం పార్టీ కోల్పోవాల్సి ఉుంటుందని సీనియర్ నేత యడియూరప్ప సైతం అధిష్టానానని చెప్పారని జగదీశ్ వెల్లడించారు. కాగా ఇప్పటికే మాజీ డిప్యూటీ సీఎం లక్ష్మణ్ సవాదీ బీజేపీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ అల్టిమేటం జారీ చేయడం కన్నడనాట రాజకీయం రంజుగా మారింది.

Advertisement

Next Story

Most Viewed