- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా
దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆదివారం పార్టీ అధ్యక్షుడికి పంపించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీ పెద్దలతో సంప్రదింపులు సైతం జరిగాయని, బీజేపీలో చేరాలని ఫిక్స్ అయ్యాకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది కీలక నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కూడా ఆయనకు మంచి అవగాహన ఉంది. ఆ పరిచయాలతోనే బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తారనే పార్టీలోకి ఆహ్వానించినట్లు చర్చ జరుగుతోంది. గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే ఎక్కువగా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటున్నారు. పార్టీలో చేరాక, ఆయనకు ఏపీ బాధ్యతలు అప్పగిస్తారా? తెలంగాణ రాజకీయాల్లో పాల్గొనాలని సూచిస్తారా? వేచి చూడాలి.