- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేంద్రమంత్రి అమిత్ షాతో బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ భేటీ
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బిహార్ మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ, హిందుస్తానీ ఆవాం మోర్చా చీఫ్ సంతోష్ సుమన్ బుధవారం ఢిల్లీలో భేటీ అయ్యారు. రెండు రోజుల క్రితం హిందుస్తానీ ఆవాం మోర్చా బిహార్ లోని నితీశ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ భేటీ జరగడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా ఈ సందర్భంగా సంతోష్ సుమన్ మాట్లాడుతూ.. నితీశ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకున్నామని, అందుకు సంబంధించిన లేఖను గవర్నర్ కు సమర్పించామని తెలిపారు.
బిహార్ లో థర్డ్ ఫ్రంట్ కు స్థానం ఉందని.. ఈ విషయమై చర్చిస్తామని పేర్కొన్నారు. ఎన్డీఏతో పొత్తు విషయాన్ని మూడు నాలుగు రోజుల్లో మీడియాకు తెలుపుతామని చెప్పారు. కాగా వచ్చే ఎన్నికల్లో బిహార్ లో బీజేపీతో కలిసి హిందుస్తానీ ఆవాం మోర్చా పోటీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.