AP Politics: సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి.. దేవినేని ఉమ డిమాండ్.. కారణం ఇదే..

by Indraja |   ( Updated:2024-05-31 04:24:08.0  )
AP Politics: సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలి.. దేవినేని ఉమ డిమాండ్.. కారణం ఇదే..
X

దిశ వెబ్ డెస్క్: నేడు టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దగ్గర లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ.. గత ఐదు సంవత్సరాలుగా ప్రభుత్వ సలహాదారు పదవి వెలగబెడుతున్న సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో రూల్స్ పాటించేవాళ్లు ఏజెంట్లగా కూర్చోవద్దని వైసీపీ చీఫ్ కౌంటిగ్ ఏజెంట్లకి ఉద్బోధించారని ఆరోపించారు.

గత 24 గంటలుగా అటు మీడియాలోనూ ఇటు సోషల్ మీడీయాలోనూ సజ్జల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయని అన్నారు. కావున ఎన్నికల సంఘం ఇమిడియేట్‌గా సజ్జలపై క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూల్స్‌ను కాదనలేక వెనక్కి తగ్గే వాళ్లు ఏజెంట్లుగా వద్దు, మనమేమీ రూల్స్‌ను ఫాలో అయ్యేందుకు అక్కడికి వెళ్లటం లేదని సజ్జల అన్నారని పేర్కొన్నారు.

అంటే నిబంధనలు నియమాలు పాటించేవాళ్లు ఎన్నికల కౌంటింగ్‌కు వెళ్లోద్దు, టీడీపీ, జనసేన కౌటింగ్ ఏజెంట్లుమీద తిరగబడేవాళ్లు, వాళ్లతో దెబ్బలాడే వాళ్లుమాత్రమే కౌటింగ్‌కు వెళ్లాలని సజ్లల చెబుతున్నారంటే ఇతనకి చట్టం పట్ల, ఎలక్షన్ కమీషన్ నిబంధనల పట్ల ఎంత గౌరవం ఉందో అర్థమవుతోందని ఎద్దేవా చేశారు. ఇటువంటి చట్టవిరోధులని, చట్టాన్ని అతిక్రమించేవాళ్లని ఇమిడియట్‌గా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన ఆయన తాడేపల్లి సీఐకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed