- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లు
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ శాసన మండలికి ఎమ్మెల్యేల కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్, కుర్మయ్యగారి నవీన్ కుమార్, చల్లా వెంకట్రామిరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఆవరణలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కు సంబంధించినఏర్పాట్లను శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పర్యవేక్షించారు.
అంతకు ముందు గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, గువ్వల బాల రాజు, పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.