ఢిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్

by Javid Pasha |   ( Updated:2023-03-09 12:07:51.0  )
ఢిల్లీలో కవిత దీక్షకు లైన్ క్లియర్
X

దిశ, వెబ్ డెస్క్: రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టిన కవిత దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన ఈ దీక్షకు తొలుత అక్కడి పోలీసులు అనుమతి నిరాకరించారు. జంతర్ మంతర్ లో సగం స్థలంలోనే కవిత తన దీక్షను చేపట్టాలని, లేకుంటే రామ్ లీలా మైదానంలో కవిత తన దీక్షను చేపట్టుకోవచ్చని అక్కడి పోలీసులు సూచించారు. దీంతో ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన కవిత.. ముందు అనుమతించి తర్వాత ఎలా నిరాకరిస్తారని మండిపడ్డారు. అయితే తొలుత కవితతో పాటు జంతర్ మంతర్ వద్ద తమ ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీజేపీ పట్టుబడింది.

దీంతో ఢిల్లీ పోలీసులు సగం స్థలంలోనే దీక్ష నిర్వహించుకోవాలని కవితకు సూచించారు. అయితే తమకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని అందువల్ల తమకే కేటాయించాలని జాగృతి నేతలు చెప్పడంతో బీజేపీ నేతలు తమ దీక్షా వేదికను దీన్ దయాళ్ మార్గ్ కు మార్చుకున్నారు. దీంతో కవిత చేపట్టిన దీక్షకు లైన్ క్లియర్ అయ్యింది. కాగా రేపు ఓ వైపు మహిళా రిజర్వేషన్ కోసం దేశ రాజధాని ఢిల్లీలో కవిత దీక్ష చేపట్టనుండగా.. పెరిగిన మద్యం షాపులు, బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా మహిళా గోస- బీజేపీ భరోసా పేరుతో రేపు హైదరాబాద్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్ష చేపట్టనున్నారు.

Advertisement

Next Story