- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRSకు గుడ్ బై! పొత్తుపై కూనంనేని సెన్సేషనల్ కామెంట్స్
దిశ, డైనమిక్ బ్యూరో: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు విషయంలో కమ్యూనిస్టుల వైఖరి సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లులో ఎలాంటి మార్పు ఉండబోదని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు కేటాయించాల్సిన సీట్లు ఇవ్వకుంటే తాము టీఆర్ఎస్ కు మద్దతు ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌తో తెగదెంపులు చేసుకుని ఒంటరిగా పోటీ చేసేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇప్పటికే తమ పార్టీ బలోపేతంపై దృష్టి సారించామని, రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ లో బూత్ స్థాయి కమిటీలు వేస్తున్నామని పొత్తు కుదరకుంటే ఒంటరిగానే ముందుకు సాగుతామని చెప్పారు. ఎల్బీనగర్ లో మంగళవారం జరిగిన రాష్ట్ర ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న కూనంనేని ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ఆసక్తిగా మారాయి.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ తో కలిసి పనిచేసిన కమ్యూనిస్టు బీజేపీని ఎదుర్కొనేందుకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి ముందుకు సాగుతామనే సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో సీపీఐ, సీపీఎం నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. రాజకీయంగా తాము ఎన్నడూ యూ టర్న్ లు తీసుకోలేదని, తమతో ఉన్నవారే యూటర్న్ లు తీసుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సోమవారం చేసిన కామెంట్స్ పరోక్షంగా టీఆర్ఎస్ ను ఉద్దేశించినవే అనే చర్చ జరుగుతోంది. తమ్మినేని ఈ రకమైన వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పొత్తు విషయంలో తమ డిమాండ్లను అంగీకరించాల్సిందే అని మాట్లాడటం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. చివరి వరకు గులాబీ జెండా, ఎర్ర జెండాలు కలిసే ఉంటాయా లేక అంతర్గత కలహాలతో వీరి బంధానికి బీటలు ఏర్పడుతాయా అనేది ఉత్కంఠ రేపుతోంది.
- Tags
- Telugu News
- trs