- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లిక్కర్ స్కామ్ దుమారం వేళ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం?
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో పలువురు ప్రభుత్వ పెద్దల సన్నిహితులకు ప్రమేయం ఉన్నట్లు ప్రచారం రోజు రోజుకూ బలపడుతోంది. ఓ వైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో స్పీడు పెంచిన వేళ సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ దుమారం చెలరేగిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఢిల్లీ టూర్‌కు వెళ్లబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలు హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారంలో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కేసీఆర్ అక్కడి నుండే మరోసారి జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 25న హర్యానాలో జరగనున్న సమ్మాన్ దివాస్ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలకు సైతం ఇన్విటేషన్ ఉంది. దీంతో ఈ సమావేశంలో పాల్గొనడంతో పాటు జాతీయ రాజకీయాల విషయంలో కీలక చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయనే ప్రచారం జరుగుతోంది.
రెండు మూడు రోజులు అక్కడే మకాం?
మాజీ ఉప ప్రధాని దేవీలాల్ జయంతి సందర్భంగా సమ్మాన్ దివాస్ ర్యాలీ జరగబోతోంది. ఈ సందర్భంగా నార్త్ ఇండియా టూర్ పెట్టుకోవాలని భావిస్తున్న కేసీఆర్ రెండు మూడు రోజులు ఢిల్లీలో మకాం వేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. విజయ దశమికి నేషనల్ పార్టీ అనౌన్స్ చేస్తారనే ఊహగానాలు వినిపిస్తున్న తరుణంలో మరోసారి జాతీయ స్థాయి నేతలతో కేసీఆర్ సమావేశమైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న తీరు ఆసక్తిని రేపుతోంది. అయితే ఈ సమావేశానికి చంద్రబాబు, ఫరూఖ్ అబ్దుల్లా, మమతా బెనర్జీ, నితీశ్, తేజస్వీ యాదవ్, శరత్ పవార్, అఖిలేష్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్‌తో పాటు ఇతర ప్రముఖ నేతలు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ ర్యాలీని తన జాతీయ రాజకీయ భవిష్యత్ కు ఒక ముఖ్యమైన వేదికగా మలుచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు భావిస్తున్నారట.
హాజరవుతారా? హ్యాండిస్తారా?
త్వరలో హర్యానా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కేసీఆర్ ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారనుంది. ఈ ర్యాలీలో కేసీఆర్ పాల్గొనడం ద్వారా జాతీయ రాజకీయాలతో పాటు తమతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్న పార్టీల వైఖరి స్పష్టం అవుతుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని ఎలాగైనా ఈ ర్యాలీని తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి ప్రచారం జరుగుతున్నట్లుగా కేసీఆర్ ఢిల్లీ టూర్ ఉండబోతుందా? హర్యానాలో జరిగే సమ్మాన్ ర్యాలీ వరకే టూర్ పరిమితం అవుతుందా? జరుగుతున్న ఊహాగానాలన్నింటినీ కొట్టిపారేస్తూ ప్రతిపక్షాల మీటింగ్‌కు చివరి నిమిషంలో హ్యాండిస్తారా అనేది మరికొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పలువురికి ఈడీ నోటీసులు ఇస్తున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే ఢిల్లీ టూర్‌కు వెళ్లనున్నారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారే అవకాశాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు.
చంద్రబాబు డేరా బాబా కంటే డేంజర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన రోజా.