- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP Politics: గంటా తీరుపై గరం గరం
దిశ ప్రతినిధి, అమరావతి: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహం ప్రభుత్వానికి చికాకు తెప్పించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా, పార్టీకి సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలు, మీడియా ప్రతినిధులతో వివాదాస్పద రుషికొండ ప్యాలెస్‌కి వెళ్లి పర్యాటకశాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి తాళాలు తీయించి ప్యాలస్ గుట్టును రట్టు చేసిన భీమిలి తెలుగుదేశం శాసనసభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైఖరిపై ముఖ్యమంత్రి కార్యాలయం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రుషికొండపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోక ముందే కేవలం ప్రచారం కోసం మీడియాని వెంటబెట్టుకు వెళ్లి హడావుడి చేయటమేంటని సీఎంఓ మండిపడినట్లు సమాచారం. ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండగా ఏనాడు వైసీపీ అన్యాయాలు అరాచకాలపై నోరు విప్పని.. చివరకు నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదాలో రుషికొండ చూడ్డానికి వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసి వెళ్లని, ఒక కేసు కూడా వేయని గంటా శ్రీనివాసరావు ఇప్పుడు హడావుడి చేయటం పట్ల సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ప్రభుత్వ అనుమతి, పార్టీ అనుమతి లేకుండా ఇటువంటి పనులు చేయద్దు అని గట్టిగానే మందలించినట్లు తెలిసింది.
ఈ రచ్చ ఏమిటి ?
రుషికొండ పర్యాటక కాటేజీలను ధ్వంసం చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం కోసం 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో అత్యంత విలాసమైన ప్యాలస్ నిర్మించిన సంగతి తెలిసిందే. వీటిని వ్యతిరేకిస్తూ విశాఖపట్నంకి చెందిన జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిల్ దాఖలు చేయగా తెలుగుదేశం పార్టీకి చెందిన శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు ఆ తర్వాత ఇంప్లీడ్ అయ్యారు.
మాజీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టు సూచనలతో ఆ తరువాత ఈ కేసులో ఇంప్లిడ్ అయ్యారు. ప్రతిపక్ష నేతగా గంటా ఒక్క రోజు కూడా రుషికొండ కట్టడాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడలేదు. ప్యాలస్ నిర్మాణం పూర్తయినప్పటికీ ఈ కేసు కారణంగా జగన్మోహన్ రెడ్డి అందులో కాలు పెట్టలేకపోయారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం మారిపోయింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు రుషికొండ పర్యటన ఒక కార్యక్రమంగా పెట్టుకొని ఆ రోజు దీని గుట్టు అంతా బయట పెట్టాలని భావించారని తెలిసింది. అయితే గంటా అత్యుత్సాహంతో వారి ప్లాన్ బెడిసికొట్టింది.
అప్పుడు టీడీపీ కార్యకర్తలకే మందలింపు
ఎన్నికల ఫలితాల రోజున పోలీసులు కళ్లు గప్పి కొందరు తెలుగుదేశం కార్యకర్తలు ప్యాలెస్ పైకి వెళ్లి జండాలు ఎగురవేశారు. భవనాల్లోకి వెళ్లకుండా మెట్ల పై నుంచి పైకి ఎక్కి తాము కనిపించకుండా జండాలు మాత్రమే కనిపించేలా వీడియాలు విడుదల చేశారు. ప్రభుత్వం ఇది కూడా తప్పేనంటూ వారిని మందలించింది.
గంటా దొరికిపోయారు
ఈ విషయం తెలియన గంటా హడావుడిగా ఆదివారం ఉదయం మీడియాను కొంత మంది కార్యకర్తలను వెంటబెట్టుకుని వెళ్లి ప్యాలెస్‌లో ఏమేమి ఉన్నాయో బహిర్గతం చేశారు. అది ఆదివారం నాడు సంచలన వార్తగా మారింది. సోషల్ మీడియా అంతా ఆ ట్రోలింగ్ వెళ్తూ నడిచింది. అయితే ప్రభుత్వం వీటిని పరిశీలించి ఏమి చేయాలన్న నిర్ణయం తీసుకోక ముందే గంటా శ్రీనివాసరావు చేసిన హడావుడి వల్ల ప్రభుత్వ ఆశయాలకు విఘాతం కలిగిందని సీఎం భావించినట్లు తెలిసింది.
గంటా అత్యుత్సాహం వల్ల రుషికొండ ప్యాలెస్‌లో తాము చేయదలుచుకున్న కార్యచరణకు ఇబ్బందులు ఎదురయ్యాయని భావించిన పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి పేషీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఇకపై రుషికొండ ప్యాలెస్‌లోకి ఎవరు వెళ్లకుండా కట్టడి చేశారు. పార్టీ శాసనసభ్యులు మంత్రులకు ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.