- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్.. ఢిల్లీకి బయలుదేరిన ఎమ్మెల్సీ కవిత
దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ కోసం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఆమెతో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎంపీ సంతోష్ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11న మొదటిసారి ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ నెల 16న విచారణకు రావాలని ఈడీ కవితకు నోటీసులు పంపింది. అయితే ఆ రోజు ఆమె వ్యక్తిగత కారణాల రీత్యా ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీంతో ఈడీ అధికారులు ఈ నెల 20న ఈడీ విచారణకు హాజరు కావాలని ఎమ్మల్సీ కవితకు మరోసారి నోటీసులు పంపారు.ఈ నేపథ్యంలోనే కవిత ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. అయితే రేపటి విచారణకు కవిత హాజరవుతారా లేక మళ్లీ డుమ్మా కొడుతారా అనేది ఉత్కంఠగా మారింది.
అంతకు ముందు ఈడీ విచారణకు పిలవకుండా చూడాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 24న చేపట్టనుంది. ఈ క్రమంలోనే కవిత సుప్రీంకోర్టు విచారణను మార్చి 20 లోపు చేపట్టాలని సుప్రీంకోర్టును కోరగా.. అందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ నెల 24నే విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఈలోగా ఈడీ అధికారులు సుప్రీంలో కేవియట్ పిటిషన్ వేశారు. ఈ అన్నింటి నేపథ్యంలో కవిత విచారణకు హాజరు కావాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. అయితే విచారణకు హాజరైతే తనను ఈడీ తనను అరెస్ట్ చేయడం ఖాయమని కవిత తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.