- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడ్డా నివాసంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్.. కర్ణాటక ఎన్నికలపై ఫోకస్
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతాయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప, కేంద్ర మంత్రి మనుసుఖ్ మాండవీయ తదితరులు ఇప్పటికే ఢిల్లీలోని నడ్డా ఇంటికి చేరుకున్నారు. ఇక ఈ సమావేశంలో కర్ణాటక ఎన్నికల గురించి పార్టీ నేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన ఫైనల్ జాబితా గురించి ఈ సమావేశంలో చర్చించనున్నారు.
ఒక్కో నియోజవకర్గం నుంచి ముగ్గురు అభ్యర్థులకు సంబంధించిన జాబితాను ఆదివారం జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ముందు పెట్టనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆదివారం నాటి మీటింగ్ లో కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన పార్టీ అభ్యర్థుల ఫైనల్ జాబితాను ప్రకటించున్నట్లు సమాచారం. ఇక ఆదివారం జరిగే పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ కు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్ తో పాటు పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.