- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్‌ను ఎన్‌కౌంటర్ చేయాలి
దిశ, పెగడపల్లి: డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తానని ఆశచూసి, అభం.. శుభం తెలియని ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ సాజిద్‌ను ఎన్‌కౌంటర్ చేయాలని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, బతికేపెల్లి ఎంపీటీసీ చింతకింది అనసూయ డిమాండ్ చేశారు. మంగళవారం పెగడపెల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఒక మైనర్ బాలికను శారీరకంగా లొంగదీసుకునేందుకు హైదరాబాద్‌లో దావత్ పేరుతో అన్నపూర్ణమ్మ అనే మహిళ మరియు కారు డ్రైవర్ సహాయంతో కారులో హైదరాబాద్‌కు రప్పించుకొని అక్కడ లాడ్జ్‌లో దారుణానికి ఒడిగట్టిన షేక్ సాజిద్‌ను, అందుకు సహకరించిన అన్నపూర్ణమ్మను, కారు డ్రైవర్‌ను 'దిశ' కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన విధంగా చేయాలని కోరారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరేళ్ల పసిపాప నుండి అరవై ఏళ్ల పండు ముసలి వరకు మహిళలకు రక్షణ కరువైందని, దీనికంతటికీ తెలంగాణ యువత మద్యానికి బానిస కావడమే అని అన్నారు. మంత్రి కేటీఆర్ ఇలాకాలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇలాంటి దారుణానికి పాల్పడటం సిగ్గుచేటని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యం, మండల ప్రధాన కార్యదర్శి పెంట నరేందర్, ఉపాధ్యక్షులు మూడపల్లి శ్రీనివాస్, బీజేవైఎం మండల అధ్యక్షులు చింతకింది కిశోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.