బండి సంజయ్ అరెస్ట్పై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్

by Javid Pasha |   ( Updated:2023-04-05 07:32:27.0  )
బండి సంజయ్ అరెస్ట్పై హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్‌ను అర్ధరాత్రి సమయంలో ఆయన నివాసంలోనే పోలీసులు అరెస్టు చేశారని, తగిన కారణాలను ఆయనకు కూడా చెప్పలేదంటూ హైకోర్టులో ఆ పార్టీ లీగల్ సెల్ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. దివంగత డిప్యూటీ ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా హైకోర్టుకు సెలవుదినం కావడంతో చీఫ్ జస్టిస్ నివాసంలో విచారణకు లీగల్ సెల్ తరఫున లాయర్లు సిద్ధమవుతున్నారు. లంచ్ మోషన్ పిటిషన్‌గా విచారించాలని విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ అరెస్టు సమయంలో నిర్దిష్ట నిబంధనలను పోలీసులు పాటించలేదని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 50ని గౌరవించలేదని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

కరీంనగర్‌లోని ఆయన నివాసంలో అరెస్టు చేసిన తర్వాత యాదాద్రి జిల్లాలోని బొమ్మలరామారం పోలీసు స్టేషన్‌లో ఎందుకు హాజరుపర్చాల్సి వచ్చిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఒకచోటి నుంచి మరో చోటికి ఆయనను తరలిస్తూ ఉన్నారని, నిర్దిష్టంగా ఎక్కడ ఉంచారో పోలీసుల నుంచి సమాధానంలేదని పేర్కొన్నారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను మాత్రలు వేసుకోడానికి కూడా తగిన అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అరెస్టు సమయంలో పోలీసులు దుడుకుగా ప్రవర్తించారని పేర్కొన్నారు.

పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం..! : KTR

Advertisement

Next Story

Most Viewed