రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బీజేపీ చీఫ్ నడ్డా

by Javid Pasha |
రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. బీజేపీ చీఫ్ నడ్డా
X

దిశ, శ్రీకాళహస్తి: రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న వైసీపీ ప్రభుత్వం అందిస్తున్నట్లు స్టిక్కర్లు వేసుకుని పాలన సాగిస్తుందని జాతీయ అధ్యక్షులు నడ్డా పేర్కొన్నారు. శనివారం తిరుపతి పార్లమెంటు పరిధిలోని శ్రీకాళహస్తి పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ అధ్యక్షులు, జాతీయ కార్యదర్శులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర నాయకులు తదితరులు విచ్చేసి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతుందని దేశంలో ఇలాంటి రాష్ట్రం ఎక్కడా లేదని 9 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో రాష్ట్రానికి ఎన్నో వేల కోట్ల రూపాయలు నిధులు ఇస్తున్న మేము ఇచ్చే సంక్షేమాలు ప్రజలకు తెలియడం లేదని వాపోయారు.

అమరావతి రాజధాని కి కట్టుబడి ఉన్నామని పదవ స్థానంలో ఉన్న దేశమును నేడు అయిదవ స్థానం వచ్చిందని గతంలో దిగుమతులు తప్ప విదేశాలకు ఎగుమతులు లేవని నేడు మోడీ ప్రభుత్వంలో ఆటోమొబైల్స్ రంగంలోనూ స్టీల్ లాంటి ఎగుమతులు భారతదేశం రెండవ స్థానంలో నిలబడిందన్నారు. మేడ్ ఇన్ ఇండియా పేరుతో త్వరలో ఆపిల్ ఫోన్ లాంటివి రావడం జరుగుతుందన్నారు. రైతులకు అందించే యూరియా కూడా గతంలో బ్లాక్ మార్కెట్ కి వెళ్లేవని నేడు వాటినరికట్టి రైతులకు అందించడం జరుగుతుందన్నారు.

11 కోట్ల 70 లక్షల మంది రైతులకు వ్యవసాయ అభివృద్ధి కోసం నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సంకల్పంతో పనిచేస్తుందని రేయంబవులు కష్టపడుతున్నారని కరోనా కష్టకాలంలో ప్రజలకు ఒక్కొక్కరికి ఐదు కేజీలు చొప్పున ఉచితంగా బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇవ్వడం జరిగింది అన్నారు. రాష్ట్రంలో అవినీతికి ప్రాధాన్యతిస్తూ... పార్టీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతికి ప్రాధాన్య తీస్తూ, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, మట్టి మాఫియా ద్వారా కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారని ప్రజలకు రక్షణ లేకుండా శాంతి భద్రతలు పూర్తిగా విఫలమైందని తెలిపారు.

బీజేపీకి అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చేసి చూపుతాం

రాయలసీమ ప్రాంతం అభివృద్ధికి వెనకబడిన ప్రాంతంగా ఉందని చెప్పవచ్చు. అయితే కలియుగ వెంకటేశ్వర స్వామి, దక్షిణ కాశీ శ్రీకాళహస్తి శివాలయానికి వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తారని తిరుపతి పార్లమెంట్ కేంద్రంగా మన ఆశ్రయానికి నిధులు, త్రిబుల్ ఐటీ, ఐషర్ లాంటి కాలేజీలు నడికుడి తిరుపతి రైల్వే మార్గానికి నిధులు అధికంగా ఇచ్చామని తెలిపారు.ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని తెలిపారు.ఇంటర్నెట్, మరుగుదొడ్లు, విద్యుత్తు సౌకర్యం భాజపా పార్టీతోనే సాధ్యమైంది.

గత కేంద్ర ప్రభుత్వంలో కొన్ని వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం రహదారులు కూడా లేని పరిస్థితి ఉండేదని ఈ తొమ్మిది సంవత్సరాల పాలనలో ఆంధ్ర రాష్ట్రంలోని 19 వేల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యంతో పాటు రెండు లక్షల గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు,పురందేశ్వరి, సునీల్ దేవదర్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సత్య ప్రకాష్, విష్ణువర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కోలా ఆనంద్ కుమార్, మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ చంద్రప్ప, గరికపాటి రమేష్ బాబు తదితర భాజాపాశ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed