కర్ణాటక ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ

by Javid Pasha |   ( Updated:2023-03-05 11:17:05.0  )
కర్ణాటక ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ
X

దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాలు గల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒవైసీ తన పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

లతీఫ్ ఖాన్ అమీర్ ఖాన్ పఠాన్ బెలగావి నార్త్ 11, దుర్గప్ప కాషప్ప బిజవాడ్ అనే వ్యక్తి ధాడ్వాడ్ ఈస్ట్ 72, అల్లాభక్ష్ బీజాపూర్ అనే వ్యక్తి బసవన్న భగేవాడి 28 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలిపారు.


Advertisement

Next Story