కాంగ్రెస్‌ది స్వయంకృతాపరాధం: శివసేన

by Ramesh Goud |
కాంగ్రెస్‌ది స్వయంకృతాపరాధం: శివసేన
X

దిశ, వెబ్‌డెస్క్: జ్యోతిరాదిత్య సింధియాను విస్మరించి రాజకీయాలు చేయలేమని, అతనికి రాష్ట్రమంతటా పట్టు ఉండకపోవొచ్చు కానీ, గ్వాలియర్, గునా వంటి పెద్ద ప్రాంతాల్లో అతని ప్రభావం బాగానే ఉందని శివసేన పత్రిక ‘సామ్నా’ పేర్కొంది. జ్యోతిరాదిత్య, 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడడానికి కమల్‌నాథ్, కాంగ్రెస్సే కారణమని, కొత్త తరాన్ని ముఖ్యమంత్రి తక్కువ అంచనా వేసినందునే మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం పతనమవబోతోందని గురువారం నాటి సామ్నా సంపాదకీయంలో పేర్కొంది. మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతే ఆ క్రెడిట్ బీజేపీకి వెళ్లదని, అది కేవలం కమల్‌నాథ్ అహంకారం, అజాగ్రత్తలు, కొత్త తరాన్ని తక్కువ అంచనా వేసే ధోరణి మాత్రమేనని అందులో తెలిపింది. ఇదిలా ఉంటే.. 22 మంది ఎమ్మెల్యేలతో జ్యోతిరాదిత్య నిన్న బీజేపీలో చేరిన అంశం తెలిసినదే.

tags : Shivsena, Madhyapradesh, BJP, Congress, kamalnath, Jyotiraditya Scindia, Digvijaya singh and kamal nath

Advertisement

Next Story

Most Viewed