- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీహెచ్ఎంసీ ఎన్నికలు.. డివిజన్‌లో నాయకులు
దిశ, మల్కాజిగిరి: మరికొన్ని రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో నగరంలోని వివిధ డివిజన్లలో రాజకీయ పార్టీల నాయకులు తమ ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారు. అభివృద్ధి పనులతో అధికార పార్టీకి చెందిన నాయకులు, సేవా కార్యక్రమాలతో ప్రతిపక్ష నాయకులు ప్రజలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు కరోనా వారియర్స్‌కు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అధికార పార్టీ నాయకులు తాజాగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు.
మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలోని అన్ని డివిజన్లలో అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్లే ఉండడం విశే షం. ఎన్నికలు జరిగి ఐదేళ్లు ముగియవస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి పనులు మొదలుపెట్టని అధికార పార్టీ నాయకులు ప్రస్తుత జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించి కాలనీల్లో పర్యటనలు మొదలు పెట్టారు. డ్రైనేజీలు, నీటి సరఫరా, పార్కుల అభివృద్ధిపై కాలనీ వాసులు చేస్తున్న విన్నపాలు, సమస్యలను వింటున్నారు. సమస్యల పరిష్కారానికి హామీలు ఇస్తూ, ఆయా కాలనీల కమిటీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నాయకులు ముఖ్యంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సైతం ఇప్పటినుండే ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్రంగానే యత్నిస్తున్నారు. సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. రక్తదాన శిబిరాలు, కరోనా వారియర్స్‌కు బియ్యం, శానిటైజర్లు, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీ, కాలనీల్లో దోమలు, కరోనా నిర్మూలనకు ‘సోడియం హైపోక్లోరైడ్’ లాంటి ద్రావణాన్ని పిచికారీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతూ పోటీపడుతున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలపై రుద్దిన అధిక కరంట్ బిల్లులు, ఎల్ఆర్ఎస్ పథకం, రెవెన్యూ డిపార్టెమెంట్ అవినీతి కార్యక్రమాలపై ఆందోళన కార్యక్రమాలలతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.