ఎన్నికలొచ్చే.. పైసల్లేవాయే!

by Anukaran |
ఎన్నికలొచ్చే.. పైసల్లేవాయే!
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూక్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో రియల్ వ్యాపారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నగరంలో ఎన్నికల వేడి మొదలైంది. బరిలో ఉండాలని ఉత్సాహం ఉన్నప్పటికీ ఎన్నికల ఖర్చులు ఎలా అని తర్జనభర్జన పడుతున్నారు. నగరంలో పోటీకి దిగే అభ్యర్థుల్లో అధిక శాతం మంది రియల్ వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారు. పోటీలో ఉంటే ఎన్నికల ఖర్చులకు నగదు లేకపోవడంతో సతమతం అవుతున్నారు. పోటీ నుంచి తప్పుకుంటే మళ్లీ అవకాశం వస్తుందో లేదోనని ఆలోచిస్తున్నారు. అందుచేత నగదు సమకూర్చుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.

నిలిచిన లావాదేవీలు..

కరోనా వైరస్ వ్యాప్తితో రియల్ వ్యాపారం తగ్గుముఖం పట్టింది. ఆ తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. భూ క్రయ విక్రయాలు జరగకపోవడంతో వ్యాపారులకు రాబడి లేకుండా పోయింది. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఆర్ధిక కష్టాలు మొదలైనాయి.
డబ్బుల వెతుకులాట ఒక వైపు… టికెట్ కోసం ప్రయత్నాలు మరో వైపు సాగిస్తున్నారు. మొత్తానికి అభ్యర్థులకు ఆర్థికం ఇబ్బందులు ఉన్నాయి.

టీఆర్ఎస్ సేఫ్…

టీఆర్ఎస్ అభ్యర్థులకు నగదు భయం లేదు. టికెట్ దక్కుతుందా లేదా అనే అనుమానం. అంతేకాకుండా బలమైన అభ్యర్థులు బరిలో ఉంటే ఎన్నికల ఖర్చు పార్టీ పెట్టుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. పార్టీ టికెట్ ఇవ్వకపోయినా స్థిరంగా ఉండాలని కొంత మంది నేతలు ఆలోచిస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఆర్థిక ఇబ్బందులుంటాయనే సమా చారం ఆశావహులకు చేరవేశారు. జీహె చ్ఎంసీ ఎన్ని కల ఖర్చులను భరించేందుకు టీఆర్ఎస్ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతిపక్షాలకు ఎల్ఆర్ఎస్, రిజిష్టేషన్ల బంద్ తో దెబ్బ పడింది. ఎన్నికల్లో ఖర్చు చేయకపోతే ఓట్లు పడటం కష్టమనే భావన ప్రతి పార్టీలో ఉం టుంది. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలకు డబ్బుల భయం పట్టుకుంది.

పెరిగిన ఎన్నికల ఖర్చు..

పోటీ చేసే అభ్యర్థుల ఖర్చు ప్రతి సారి పెరుగుతుంది. గతంలో ఓటుకు రూ.500 నుంచి రూ.1000ల వరకు పంపిణీ చేశారు. ఇప్పు డు అంతే డబ్బులు పం పిణీ చేస్తే ఓట్లు పడటం కష్టం అంటున్నారు. వాల్ పోస్టర్, కరపత్రాలు తదితరుల ఖ ర్చులు పెరిగాయి. ఒక్క అభ్య ర్థికి సాధారణంగా ఖ ర్చు చేస్తే రూ.3కోట్లకు పైన అవుతుంది.

Advertisement

Next Story